19ఏళ్ల యువతి పై అత్యాచారం..ఆపై పదో అంతస్తు నుంచి !
చిన్న, పెద్ద, వయస్సు మరియు రక్త సంబంధం అనే తేడాలు లేకుండా మృగాల్లా వ్యవహరిస్తున్నారు కొందరు నీచులు. ఇటీవల హైదరాబాద్లోని సింగరేణి కాలనీ లో జరిగిన దుర్ఘటన మరవక ముందే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. 19 ఏళ్ల వయస్సు ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ కు చెందిన ప్రతీక్ వైశ్ అనే వ్యక్తి పాల డేయిరి ని నడుపుతున్నాడు. అయితే ప్రతీక్ వద్దనే... బాధిత మహిళ కూడా ఆ డేయిరి లో పని చేస్తోంది. అయితే.. ఆ యువతిపై మొదటి నుంచి కన్నేశాడు నిందితుడు ప్రతీక్.
ఈ నేపథ్యంలోనే గడిచిన మంగళవారం రోజున... ఆ బాధిత మహిళ ను తన ఫ్లాట్ లోకి తీసుకొని పోయాడు నిందితుడు ప్రతీక్. ఫ్లాట్ కు వెళ్లిన అనంతరం ఆ యువతి పై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. అయితే ప్రతిఘటించింది ఆ యువతి. అయినప్పటికీ తగ్గని ప్రతీక్... డబ్బు ఆశ చూపాడు. అయితే కూడా ఆ బాధిత మహిళ ససేమిరా అనడంతో దౌర్జన్యంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి బలవంతంగా ఆ మహిళను అత్యాచారం చేశాడు నిందితుడు ప్రతీక్. ఇక ఈ విషయాన్ని పోలీసులకు చెబుతానని ఆ మహిళ బెదిరించడంతో పదో అంతస్తు నుంచి తోసేసాడు ప్రతీక్. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ప్రతీక్ ను అరెస్టు చేశారు.