ప్రేమించి పెండ్లాడింది.. ప్ర‌శ్నించాడ‌ని భ‌ర్తను క‌త్తితో పొడిచింది..!

Paloji Vinay
ఇప్పుడు ఉన్న ప‌రిస్థితులు త‌రువాత ఎలా ఉంటాయో ఎవరూ చెప్ప‌లేరు. ఎవ‌రు ఎప్పుడు ఎలా, ఎందు మారిపోతారో తెలియ‌దు. ఇప్పుడు మిత్రులుగా ఉన్న వాళ్లే త‌రువాత శ‌త్రువులుగా మారిపోతారు. ఇలా చాలా సంఘ‌ట‌న‌లు మ‌నం చూస్తూనే ఉంటాం. కానీ, ఓ అమ్మాయి ఓ వ్య‌క్తిని ప్రేమించింది.. పెద్ద‌ల‌కు చెప్ప‌డంతో ఒప్పుకోలేదు వారిని ఎదిరించి పెళ్లి చేసుకుంది... కొన్ని నెల‌ల‌ త‌రువాత క‌ట్టుకున్న భ‌ర్త‌నే చంపాల‌ని చూసింది.. ఎందుకు అలా చేసింది అని తెలుసుకోవాలంటే ఈ స్టోరి చ‌ద‌వాల్సిందే..

     

    కాలేజికి వెళ్లున్న ఓ అమ్మాయికి  బస్సు కండక్టర్‎తో పరిచయం ఏర్పడింది. ప‌రిచ‌యం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు.  కానీ, ఇందుకు వాళ్ల‌ పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో చేసేదేమీ లేక పెద్దలను ఎదురించి వివాహం చేసుకుని ఓ చోట కాపురం మొద‌లు పెట్టారు.  వారికి పాప పుట్ట‌డంతో.. ఇరు కుటుంబాల వారు వాళ్లిద్ద‌రినీ దగ్గరకు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో దంప‌తుల ఇద్దరికి గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి.


     వివ‌రాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని సేలం జిల్లా ఎడప్పాడి కి చెందిన బాలమురుగన్ ప్రైవేట్ బస్సులో కండెక్టర్‎గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. క్రిష్ణగిరి జిల్లాలోని పారిస్ ప్రాంతానికి చెందిన ఇలాకియా అనే అమ్మాయి ప్ర‌యివేట్ కాలేజీలో చదువుతోంది.  కాలేజీకి బాల‌మురుగ‌న్ కండ‌క్ట‌ర్‌గా ప‌ని చేస్తున్న‌ అదే బస్సులో ప్ర‌యాణించేది.  ఈ క్రమంలో ఇలాకియాకు బాలమురుగన్ పరిచయం అయి ప్రేమగా మారింది.  కొంత కాలం వీరిద్దరి ప్రేమ వ్యవహారం న‌డిచింది. పెళ్లి చేసుకోవాలనుకుని ఈ విషయం ఇరు కుటుంబాల‌కు చెప్పారు. అయితే దీని వాళ్లు పెద్దలు ఒప్పుకోక‌పోవడంతో పెద్దలను ఎదురించిన బాలమురుగన్, ఇలాకియా 2020 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు.


    ఇలా సంవ‌త్సరం త‌రువాత పాప జ‌న్మించడంతో  బాల మురుగున్, ఇలాకియా ఇద్ద‌రి కుటుంబ స‌భ్యులు ద‌గ్గ‌రికి తీసుకున్నారు. త‌రువాత దంపతుల మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రిగేవి. దీంతో ఇలాకియా కొన్ని నెల‌ల క్రితం త‌న త‌ల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. అనంత‌రం పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో బాల‌మురుగ‌న్ పై కేసు న‌మోదు చేసుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. కొన్ని రోజుల త‌రువాత జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఇలాకియా, బాలమురుగ‌న్ మ‌ధ్య రాజీ కుదిర్చారు. దీంతో ఇద్ద‌రు మ‌ళ్లీ క‌లిసిపోయారు.



 రాత్రి స‌మ‌యాల్లో ఇలాకియా ఫోన్ మాట్లాడడం చూశాడు బాల‌మురుగన్‌. దీంతో ఆమెను ప్ర‌శ్నించాడు. ఈ క్ర‌మంలో ఒక‌రోజు వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ స్థాయికి చేర‌డంతో ఇలాకియా.. త‌న‌ భ‌ర్త ఛాతి భాగంలో పోడిచింది. దీంతో బాల‌మురుగున్ అరుపులు విన్న చుట్టు ప‌క్క‌ల వాళ్లు వ‌చ్చి బాల‌మురుగ‌న్ ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు ఇలాకియాను పోలీసులు అరెస్టు చేసి మ‌హిళా జైలు కు త‌ర‌లించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: