దారుణం : ఇలాంటి తండ్రి భూమ్మీద ఉండకూడదు?
కానీ నేటి రోజుల్లో మాత్రం సొంత వారి నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. దాంతో ఇక బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతోమంది ఆడపిల్లలు మనస్థాపంతో బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వారే అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కింద కంటికి రెప్పలా కాచుకునే తండ్రి కామపు చూపులతో ఏకంగా సొంతబిడ్డపైనే అత్యాచారాలకు పాల్పడుతు ఉండటం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుంది. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇక్కడ ఒక తండ్రి ప్రవర్తించిన తీరు సభ్యసమాజాన్ని సిగ్గు పడేలా చేస్తుంది. ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన కూతురిపైనే ఓ తండ్రి లైంగిక దాడికి దిగాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం లో వెలుగులోకి వచ్చింది. పదిహేనేళ్ల బాలికకు మద్యం తాగించిన తండ్రి ఇక మద్యం మత్తులో వుండగానే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇక ఈ తతంగాన్ని మొత్తం ప్రియురాలితో వీడియో తీయించి పైశాచిక ఆనందాన్ని పొందాడు ఆ తండ్రి. ఇటీవలే బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో బాధిత తల్లి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామాంధుడైన తండ్రి అరెస్టు చేశారు.