యూపీ ఘటనపై భగ్గుమంటున్న రైతు సంఘాలు.. ఏం జరగబోతోంది..?

MOHAN BABU
ఉత్తర ప్రదేశ్ లఖింపూర్ ఖేరి ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాలు, రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి. రైతులను అన్యాయంగా చంపేశారని దీనికి యూపి, కేంద్ర ప్రభుత్వాలదే బాధ్యత అని ఆరోపిస్తున్నాయి. లఖింపూర్ ఘటనను నిరసిస్తూ నేడు దేశ వ్యాప్తంగా రైతు సంఘాల ఆందోళనలకు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెక్ పొస్టులు ఏర్పాటు చేసి ఆందోళనకారులను రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేపట్టారు. అంతేకాదు ఇంటర్నెట్   సేవలను కూడా అధికారులు నిలిపివేశారు. లఖింపూర్ ఖేరి జిల్లాలో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి కేంద్ర మంత్రి  అజయ్ మిశ్రా, డిప్యూటీ సీఎం  కేశవ ప్రసాద్ మౌర్య  హాజరయ్యారు. వీరి  పర్యటనను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అదే సమయంలో కేంద్ర మంత్రి, డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతుల పై కి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రైతులు వాహనాల పై దాడి చేశారు.
వాటికి నిప్పుపెట్టారు.


 దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు రైతులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. పరామర్శించేందుకు లక్నో నుంచి లఖింపూర్ కి వెళ్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ  ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను సీతాపూర్ పోలీస్ స్టేషన్  కి తరలించారు. తనను ఎందుకు అరెస్టు చేశారని  బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లే హక్కు కూడా లేదా అంటూ యోగి సర్కార్ ను నిలదీశారు ప్రియాంక గాంధీ. రైతుల మృతికి బిజెపి ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తానన్నారు. అటు లక్నో లోనూ సెక్యూరిటీ టైట్ చేశారు సమాజ్వాదీ పార్టీ అధినేత. అఖిలేష్ యాదవ్ ఇంటిముందు పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వ తీరుపై అఖిలేష్ యాదవ్ మండి పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: