పొంగిపొర్లిన మందు.. అమ్మాయిల‌తో చిందు.. అంత‌లోనే ట్విస్ట్‌

N ANJANEYULU
హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని శివారు ప్రాంత‌మైన ఎల్బీన‌గ‌ర్ నియోజ‌కవ‌ర్గంలో చేప‌ట్టిన ఓ కార్య‌క్ర‌మం క‌ల‌క‌లం సృష్టించింది. ఎల్బీన‌గ‌ర్‌లో అశ్లీల నృత్యాలు క‌ల‌క‌లం రేపాయి. వివ‌రాల్లోకి వెళ్లితే.. ఎల్బీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో నాగోల్ డివిజ‌న్‌లోని బండ్ల‌గూడ‌లో ల్యాండ్ మార్క్ అనే రియ‌ల్ ఎస్టేట్ సంస్థ వార్షికోత్స‌వం నిర్వ‌హించారు.  నాగోల్ లోని పీఎంఆర్ ఫంక్ష‌న్‌హాల్‌లో చిన్న పార్టీని ఏర్పాటు చేశారు. అధికారికంగా ఎలాంటి అనుమ‌తులు తీసుకోలేదు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు ఉల్ల‌ఘించారు.
ల్యాండ్‌మార్క్ యాజ‌మాన్యం  నిర్వ‌హించిన పార్టీలో మ‌ద్యం ఏరులై పొంగింది.  కేవ‌లం మ‌ద్యం మాత్ర‌మే కాకుండా, అంత‌టితో ఆగ‌కుండా అమ్మాయిల‌తో అశ్లీల నృత్యాలు చేశారు. అదేవిధంగా పెద్దఎత్తున డీజే సౌండ్ పెట్టారు. దీనిపై స్థానికులకు తీవ్ర ఇబ్బంది కావ‌డంతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు.  ఈ విష‌యం ఆ నోటా.. ఈ నోటా ప‌డి పోలీసుల వ‌ర‌కు చేరింది.   డీజే సౌండ్‌తో నిద్ర రాక ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని స్థానికులు పోలీసుల‌కు వివ‌రించారు.  అయినా పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని ప‌లువురు ప్ర‌జ‌లు ఆరోపించారు.

 
ఎట్ట‌కేల‌కు చివ‌ర‌కు పోలీసులు గుట్టుచ‌ప్పుడు కాకుండా పీఎంఆర్ గార్డెన్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్క‌డ జ‌రిగే తతంగాన్ని అంతా క్షుణ్ణంగా ప‌రిశీలించారు.  ఆ త‌రువాత డీజేని బంద్ చేయించారు. ఆర్గ‌నైజ‌ర్ యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాకు చెందిన ర‌వీంద‌ర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌నితో పాటు కంపెనీకి య‌జ‌మాన్యాన్ని, ప‌లువురు ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్ల‌ను అరెస్ట్ చేశారు. డ్యాన్స‌ర్లు పోలీసుల‌ను గ్ర‌హించి ప‌క్క‌కు జారుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. అదేవిధంగా ఫంక్ష‌న్‌హాల్ నిర్వాహ‌కుల‌ను సైతం పోలీసులు హెచ్చ‌రించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌రోసారి పున‌రావృతం అయితే ఫంక్ష‌న్‌హాల్ మూసివేయాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రిక జారీ చేశారు. మ‌ద్యం మ‌త్తులో వారు ఇష్టం వ‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించార‌ని ఫంక్ష‌న్‌హాల్‌కు సంబంధించిన వ్య‌క్తులు పోలీసుల‌కు వివ‌రించారు. ఈ ఘ‌ట‌న ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడ వైర‌ల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: