ఆమె రెండోసారి.. మళ్లీ అలాంటి పనే చేసింది?

praveen
మాజీ మిస్ తెలంగాణ గా గుర్తింపు పొందిన యువతి హాసిని ఇటీవలే హైదరాబాద్ లో ఉంటుంది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా మనస్థాపం చెంది ఆత్మహత్య యత్నం చేయడం సంచలనం గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే తన గదిలో ఉరేసుకుంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఫోన్ చేసి నేను చనిపోతున్నాను క్షమించండి అంటూ చెప్పింది. అయితే వెంటనే అప్రమత్తమైన స్నేహితులు పోలీసులకు సమాచారం అందించడంతో ఇక ఫిర్యాదు అందుకున్న పోలీసులు హుటాహుటిన చేరుకున్నారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి యువతిని రక్షించారు.


 అపస్మారక స్థితిలోకి వెళ్లిన హాసిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఇక తల్లిదండ్రులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసాక ఆమెను సొంతూరు కి తీసుకెళ్లారు. అయినప్పటికీ హాసిని తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇక ఇటీవల మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది మాజీ మిస్ తెలంగాణ హాసిని. మొదట ఆత్మహత్య చేసుకున్న తర్వాత అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించగా.. ఇక ఆ తర్వాత ఆస్పత్రి నుంచి నేరుగా ఆమె తల్లిదండ్రులు స్వస్థలం అయిన కృష్ణా జిల్లాకు తీసుకువెళ్లారు


 అయితే ఆత్మహత్యకు గల కారణం ఏమై ఉంటుంది అని ఆ యువతిని పోలీసులు ప్రశ్నించగా.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు పోలీసులకు తెలిపింది. తను చాలా అవమానాలు పడ్డాను అని అనేక కేసులు ఎదుర్కొన్నా అంటూ తెలిపింది. ఆత్మహత్య చేసుకోవడం తప్పు అని తెలిసినప్పటికీ తనకు ఎవరూ అవసరం లేదని గతంలో ఎన్నో వేధింపులను కూడా ఎదుర్కొన్నాను అంటూ హాసిని తెలిపింది. అయితే ఎంతో కష్టపడి పోలీసులు ఆ యువతి ప్రాణాలు రక్షించిన తర్వాత ఇక ఇటీవల మరోసారి హాసిని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారిపోయింది.



 అయితే స్వగ్రామానికి తరలించి తల్లిదండ్రులు ఎంత చెప్పినప్పటికీ తననిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు హాసిని. ఈ క్రమంలోనే ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ యువతి మరోసారి కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జి పైనుంచి మున్నేరులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. యువతి మున్నేరు లో దూకుతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఆమెను గుర్తించారు. వెంటనే మున్నేరు నీటిలో ఉన్న ఆమెను కాపాడి నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: