భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు  చూస్తుంటే అటు మనిషి పోకడ ఎటువైపు పోతుందో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది. రోజురోజుకు మనుషులు కాస్త మానవత్వం లేని క్రూరమృగాలు గా మారిపోతున్నారు. అయితే రోజురోజుకు ఇలాంటి తరహా ఘటనలు సభ్యసమాజాన్ని మొత్తం ఉలిక్కి పడేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పరాయి వ్యక్తుల విషయంలోనే కాదు సొంత వాళ్ల విషయంలో కూడా కాస్త కూడా జాలి దయ అనేది చూపించడం లేదు నేటి రోజుల్లో జనాలు. ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన వారిని సైతం దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వస్తున్నాయి. అడవిలో బ్రతికే క్రూరమృగాలు అయినా ఏకంగా కడుపున పుట్టిన పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడు కుంటాయి   ఏమో కానీ అటు మానవత్వం ఉన్న మనుషులు మాత్రం రక్తం పంచుకుని  పుట్టిన పిల్లలను దారుణంగా హత మార్చుతున్నారు.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన కొన్నాళ్ళ వరకు ఆ ఇద్దరి భార్య భర్తల బంధం ఎంతో అన్యోన్యంగా నే ఉంది. కానీ అంతలో వీరి బంధం మధ్యలోకి అనుమానం పెనుభూతం వచ్చింది. ఇక అప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరగడం మొదలైంది. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త చివరికి దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా ఎనిమిది ఏళ్ల కూతురు గొంతు కోసి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన చెన్నైలోని విల్లివాక్కం లో వెలుగులోకి వచ్చింది. రాధాకృష్ణన్ అనే 34 ఏళ్ల వ్యక్తి  భార్యపై అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.



 వివరాల్లోకి వెళితే.. రెడ్ హిల్స్ రోడ్డు 5వ వీధికి చెందిన రాధాకృష్ణన్ లావణ్య అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. కాగా లావణ్య ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. అయితే ఇటీవలే భర్త రాధాకృష్ణన్ భార్య లావణ్య పై అనుమానం పెంచుకున్నాడు.  ఈ క్రమంలోనే ప్రతిరోజు  గొడవ పడేవాడు. దీంతో భర్త వేధింపులు తాళలేక పోయిన భార్య అదే ప్రాంతంలో పిల్లలతో విడిగా ఉంటుంది. కాగా ఇటీవలే పిల్లలను చూడడానికి లావణ్య వద్దకు వెళ్లిన భర్త ఆమె ఇంట్లో లేని సమయం చూసి మీ అమ్మ ఎవరితోనైనా మాట్లాడుతుందా అంటూ బాలికను అడిగాడు. బాలిక మాత్రం ఏం సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయి కత్తితో గొంతు కోశాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి పరారైన రాధాకృష్ణన్ పోలీసుల ముందు లొంగిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: