కామంతో ఊగిపోయిన 14ఏళ్ల బాలుడు.. చివరికి?
ముఖ్యంగా నేటి రోజుల్లో పెరిగిపోతున్న టెక్నాలజీ అటు చిన్నారులను పెడదోవ పట్టించే విధంగా మారిపోతుంది. తెలిసీ తెలియని వయసులోనే కామంతో ఊగిపోతున్న ఎంతో మంది బాలురు ఏకంగా చిన్నారులపై అత్యాచారాలను పాల్పడుతున్న ఘటనలు కూడా సభ్య సమాజంలో మనిషి తీరు ఎటు పోతుందో అన్న విషయాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. ఆడుకోవాల్సిన వయసులో నే కామంతో ఊగిపోయి అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఎంతో మంది బాలురు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అతని వయసు 14 ఏళ్లు మాత్రమే.
ఇంకా తల్లిదండ్రుల చాటు బిడ్డగా అనే పెరుగుతున్నాడు.. రోజూ స్కూలుకు వెళ్లడం ఇంటికి వచ్చి హోం వర్క్ పూర్తి చేయడం స్నేహితుల తో ఆడుకోవడం చేసేవాడు ఆ బాలుడు. కానీ ఇటీవల కాలంలో బాలుడు ఆలోచన మొత్తం తప్పుదారి పట్టింది. దీంతో కామం తో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారిపై 14ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని చిన్న శంకరం పేట మండలం సూరారం గ్రామం లో వెలుగులోకి వచ్చింది ఆడుకుందాం అని ఐదేళ్ళ చిన్నారిని పిలిచి ఏకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. పక్క ఇంట్లో ఉన్న చిన్నారి తల్లి వచ్చి చూసి ఆ బాలుడిని మందలించింది. అయితే చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.