షాకింగ్ : చికెన్ ముక్క ప్రాణం తీసింది?
ఇక కాస్త సమయం దొరికిందంటే చాలు చికెన్ లాగించేస్తుంటారు. ఇక వారాంతంలో అయితే చికెన్తప్పనిసరిగా ఉండాల్సిందే. మరి కొంతమంది అయితే ముక్క లేనిదే ముద్ద దిగదు అన్న విధంగా ఉంటారు. కానీ ఇక్కడ జరిగిన విషయం గురించి తెలిస్తే మాత్రం చికెన్ తినడానికి చాలామంది భయపడిపోతారు అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చికెన్ ముక్క ఏకంగా ఒక వ్యక్తి ప్రాణం తీసింది. కేవలం నిమిషాల వ్యవధిలో చూస్తూ చూస్తుండగానే ఒక వ్యక్తిప్రాణాలు కోల్పోయాడు. ఇలా చికెన్ ముక్క ప్రాణం తీసిన ఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది.
చికెన్ తింటుండగా గొంతులో ఎముక ఇరుక్కొని వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. చెన్నైలోని అందియురు సమీపంలోని కూచి కల్లూరు కి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తాపీ మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవలే మధ్యాహ్నం సమయంలో అదే ప్రాంతంలో ఉన్న స్నేహితుడు మునిరాజు ఇంటిలో కోడి మాంసం తిన్నాడు సుబ్రహ్మణ్యం. ఈ క్రమంలోనే చికెన్ తింటుండగా ఓ చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయ్యాడు సుబ్రహ్మణ్యన్. ఇక స్నేహితులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.