జైల్లో పోలీసులపై ఖైదీల దాడి.. ఎందుకో తెలుసా?

praveen
సాధారణంగా వివిధ నేరాలలో శిక్షలు పడిన నేరస్తులను అటు జైల్లో ఉంచుతారు అన్న విషయం తెలిసిందే. అయితే ఒకసారి జైలుకు వెళ్లిన తర్వాత సాధారణ జీవితానికి పూర్తిగా దూరం అయి పోతూ ఉంటారు ఖైదీలు. ఇక జైలులో పెట్టిన ఆహారం తినడం జైలులోనే ఏదో ఒక పని చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఒకవేళ ఖైదీలకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే అటు పోలీసులే డాక్టర్ ని పిలిచి వైద్యం చేయించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు పోలీసులు ఎలా చెబితే అలా వింటూ ఉంటారు. కానీ ఇక్కడ ఖైదీలు మాత్రం రెచ్చిపోయారు ఏకంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు వారికి  కాపలా కాస్తున్న పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు.


 ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని జై పతేఘార్ సెంట్రల్ జైలులో వెలుగులోకి వచ్చింది. జైలు సిబ్బంది అధికారుల పై ఖైదీలు రాళ్ల దాడికి పాల్పడటం సంచలనం గా మారిపోయింది. అయితే కాసేపటికి అప్రమత్తమైన పోలీసు అధికారులు ఖైదీలను కంట్రోల్ సర్వ ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే రెచ్చిపోయిన ఖైదీలు జైలు లోని కొంత భాగానికి నిప్పు అంటించడం  కూడా గమనార్హం. అయితే ఖైదీలు ఎందుకు ఇంతకు తెగించి ఏకంగా పోలీసులపై దాడికి పాల్పడ్డారు అన్నది మాత్రం  ప్రస్తుతం హాట్ టాపిక్ గా  మారిపోయింది.


 ఉత్తరప్రదేశ్లోని జై పతేగర్  కారాగారంలో ఖైదీ లు తోటి ఖైదీ మృతిచెందాడు అన్న కారణంతోనే ఇక ఇలా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.  అదే జైలులో హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సందీప్ కుమార్ అనే ఖైదీ అనారోగ్యం బారిన పడ్డాడు. అయితే ఇటీవలే అతను మృతి చెందాడు. సరైన సమయంలో అతనికి చికిత్స అందించకపోవడం వల్లే మృతి చెందాడు అని తోటి ఖైదీలు ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇక జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు పోలీసు అధికారుల పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై నివేదిక ఇవ్వాలి అంటు జైలు అధికారులను కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: