ఛీ ఛీ వీడు మనిషా.. మృగమా?

praveen
నేటి సభ్యసమాజంలో మహిళగా పుట్టడమే పాపమా అంటే ఏమో మరి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ప్రతి  మహిళ అలాగే అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అడుగడుగునా మహిళలకు రక్షణ కరువవుతోంది  కామంతో కళ్లుమూసుకు పోయి మహిళ కనిపిస్తే చాలు పశువుల్లా మీద పడిపోతున్నారూ. నెలలు నిండని పసికందుల నుంచి పండు ముసలి వరకు కూడా ఎవరిని వదలడం లేదు. ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఇక ఆడపిల్ల జీవితం రోజురోజుకీ ప్రశ్నార్థకంగానే మారిపోతుంది అని అర్థమవుతుంది.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.. మద్యం ఆ మనిషిని కమ్మేసింది.. మద్యం మత్తులో కామంతో ఊగిపోయాడు.. తాను అడవిలో బ్రతికే జంతువు కాదు సభ్య సమాజంలో బ్రతికే  ఒక మనిషి అన్న విషయాన్ని  మనసులో నించి తీసేసాడు.. కళ్ళ ముందు ఎవరు కనిపిస్తే వారిపై కామకోరికలు తీర్చుకోవాలి అని అనుకున్నాడు.  ఈ క్రమంలోనే మద్యం మత్తులో మానవ మృగం లాగా చుట్టుపక్కల చూడటం మొదలుపెట్టాడు. చివరికి ఆ  మానవ మృగం కళ్ళల్లో ఓ వృద్ధురాలు పడింది. చివరికి ఆ వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.


 సేలం జిల్లా కర్మండు రైకి చెందిన వృద్ధురాలు మేకలు మేపుతూ జీవనం సాగిస్తూ ఉంటుంది. అయితే శనివారం సాయంత్రం సమయంలో ఇక ఎప్పటిలాగానే మేకలు మేపుతూ ఉంది సదరు వృద్ధురాలు. అయితే అదే ప్రాంతానికి చెందిన షణ్ముగం అనే 25 ఏళ్ల యువకుడు మద్యం తాగి అటువైపుగా వచ్చాడు. అప్పటికే కామంతో ఊగిపోయిన ఆ యువకుడు ఆ 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేయాలని భావించాడు. ఈక్రమంలోనే సమయం కోసం చూసి  వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఆమె భయంతో అరవడంతో అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇంతలో నిందితుడు షణ్ముగం అక్కడి నుంచి పరారయ్యారు. ఇక స్థానికుల సహాయంతో వృద్ధురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: