ఎల్బీ నగర్ ప్రేమోన్మాది దాడి కేసులో బిగ్ ట్విస్ట్ !

Veldandi Saikiran
ఎల్బీ నగర్ ప్రేమోన్మాది దాడి కేసులో  దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఎల్బీ నగర్ లోని నవీన హాస్పిటల్ లో యువతికి చికిత్స కొనసాగుతుండగా....  క్రిటికల్ గానే యువతి కండిషన్ ఉండటం చాలా విచారకరమైన అంశం.  తన తో పెళ్లి నిరాకరించిందని కక్షతో 18 కత్తి పోట్లు పొడిచిన ప్రేమోన్మాది... వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చంద్రకల్ కు చెందిన యువతిగా నిన్న పోలీసులు గుర్తించారు.  గత కొంత కాలం గా ఎల్బీనగర్ లోని హస్తినాపురంలో తన పిన్ని తో కలిసి ఉంటున్న యువతి... 


గతంలో బాధిత యువతి, నిందితుడు బస్వరాజు ప్రేమాయణం కొనసాగించినట్లు పోలీసులు కూడా   గు ర్తిం చారు. ఇ దే విషయా న్ని స్థాని కులు కూడా చెప్పారు. బస్వరాజు తో పెళ్లికి నిరాకరించిన శిరీష తల్లిదండ్రులు.. శ్రీధర్ అనే వ్యక్తి తో ఇటీవల శిరీష కు ఎగేంజ్ మెంట్ చేసినట్లు సమాచారం అందుతోంది... విషయం తెలుసుకున్న బస్వరాజు శిరీష పై అక్కసు తో దాడి..కి పాల్పడ్డాడు ఆ ప్రేమోన్మా ది. ఇక ప్రేమోన్మాది దాడి లో తీవ్రంగా గాయపడిన శిరీష...ప్రస్తుతం ఆస్పత్రి చికిత్స తీసుకుంటుందని ఎల్బీనగర్‌ పోలీసులు స్పస్టం చేస్తున్నారు.  

ఇప్పటికే నిందితుడు బస్వరాజు ను అదుపులోకి తీసుకున్న పోలీసులు....  ఈ కేసు లో ఆ నిందితున్ని విచారిస్తున్నారు. దాడి లో యువతి కి 2 మేజర్ గాయాలు... చెస్ట్ భాగం లో 3 కత్తి పోట్లు, పొత్తి కడుపు లో 3 కత్తి పోట్లు తీవ్రంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.  ఊపిరితిత్తుల నుండి రక్త స్రావం జరుగుతుంది..ఈరోజు మరోసారి స్కానింగ్ తీయనున్నారు డాక్టర్లు ఊపిరితిత్తుల నుండి రక్త స్రావం పెరిగితే సర్జరీ తప్పనిసరి అని చెబుతున్నారు.. ఇక ఈ సంఘటనపై యువతి కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందుతున్నారు.ఆ నిందితున్నిశికించాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: