ఛీ ఛీ.. సానిటరీ ప్యాడ్ తో.. ఆ పాడు పని చేసిన మహిళ?
అయితే ఇటీవలి కాలంలో అటు ఎయిర్పోర్టులో అక్రమంగా డ్రగ్స్ తరలించడం లేదా బంగారాన్ని తరలించడం లాంటివి చేస్తున్నారు ఎక్కువమంది. అయితే ఇలా బంగారాన్ని అక్రమంగా తరలించడం కి అధికారులకు తెలియకుండా చిత్ర విచిత్రంగా అక్రమార్కులు వినూత్నంగా ప్రయత్నిస్తూ ఉండటం గమనార్హం. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఘటన అయితే అందరూ ఒక్కసారిగా షాక్ కి గురి చేస్తుంది అని చెప్పాలి. ఇటీవలే ఏకంగా ఒక జీన్స్ పాయింట్ కి బంగారు పూత పూసీ ఎవరికి తెలియకుండా అక్రమంగా బంగారాన్ని తరలించడం ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా సానిటరీ ప్యాడ్స్ కూడా బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ఉపయోగించుకున్నారు.
శానిటరీ ప్యాడ్స్ లో బంగారాన్ని దాచి అక్రమ రవాణా చేస్తున్న చేస్తున్న వారిని ఇటీవలే అధికారులు అరెస్టు చేశారు. అయితే ఇలా శానిటరీ ప్యాడ్స్ లో బంగారాన్ని దాచి అక్రమ రవాణా చేస్తుంది ఎవరో కాదు ఏకంగా ఎయిర్ ఇండియా మహిళా ఉద్యోగి కావడం గమనార్హం. ఇలా మహిళా ఉద్యోగిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. కేరళ కోజికోడ్ విమానాశ్రయంలో ఆ మహిళ ఉద్యోగి దగ్గర నుంచి 2.4 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారాన్ని తన లో దుస్తుల్లో దాచిందని అధికారులు తెలిపారు. షార్జా నుంచి వచ్చిన సదరు మహిళను అనుమానంతో సిబ్బంది చెక్ చేసినట్లు అధికారులు తెలిపారు.. ఇక ఆమె కోజికోడ్ కు చెందిన షహనా గా గుర్తించారు అధికారులు.