బట్టతలపై విగ్గు పెట్టుకుని.. ఎంత పని చేసాడు?
అయితే ఇతను విగ్గు పెట్టుకొని కవర్ చేయడం అంటే జాబ్ కి వెళ్లడానికో లేక ఇంకేదైనా చేయడానికో కాదు వేగంగా అమ్మాయిలకు ఎర వేయాడానికి విగ్గులు ఉపయోగించుకున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి. బట్టతలను కవర్ చేసి విగ్గు పెట్టుకుని అమ్మాయిలను ఎర వేయడం ప్రారంభించాడు. సోషల్ మీడియాలో ఎంతో మంది అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. అంతేకాదు తాను ఒక పెద్ద ఎన్నారై అంటూ కవరింగ్ ఇవ్వడం ముద్దులు పెట్టాడు. గ ఈ కేటుగాడు మాటలు నమ్మిన ఎంతో మంది అమ్మాయిలు ఇతని వలలో పడ్డారు. కొన్నాళ్ళ వరకు మహిళతో సహజీవనం చేయడం ఆ తర్వాత నగలు నగదు కాజేసే తప్పించుకు తిరగడం చేసేవాడు ఈ కేటుగాడు.
ఈ ఘటన ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తునికి చెందిన షేక్ మహ్మద్ రఫీ నీ ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన మహిళతో సహజీవనం చేసి నగలు నగదు దోచుకెళ్లారు. ఈ కేటుగాడు ఇప్పటివరకు ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు 20 మంది మహిళలకు వలవేసి భారీగా దండు ఉన్నాడు. తన బట్టతలను విగ్గు తో కవర్ చేస్తూ.. ఎన్ఆర్ఐ అని చెబుతూ వల వేసే వాడు. ఇటీవలే హైదరాబాద్కు చెందిన ఓ మహిళకు కార్తీక్ వర్మ గా పరిచయమయ్యాడు. ఆమెకు మాయమాటలు చెప్పి 18.5 తులాల బంగారం తీసుకొని పరారయ్యాడు. ఇక మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేటుగాడి రాసలీలలు కాస్త బయటపడ్డాయి.