అమెరికాలో అంతా భయం భయం.. మళ్లీ అదే ఘటన?

praveen
అగ్రరాజ్యమైన అమెరికా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంటుంది. ఇక అమెరికాలో ఉద్యోగం వస్తే అంతకంటే గొప్ప ఇంకేమీ ఉండదు అని భావిస్తూ ఉంటారు ప్రపంచ దేశాల ప్రజలు. ఇక అమెరికా ని ఒక గొప్ప స్థానంలో చూస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో అగ్రరాజ్యమైన అమెరికా లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మాత్రం అమెరికా పేరు తలుచుకో వడానికే భయపడిపోతున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

 ఇటీవలే మరో సారి అమెరికాలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువ ర్యాపర్ పై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆ ర్యాపర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. అమెరికాలోని టెన్నెస్సి రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మెంఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక కుకి షాపు ఉంది. ఇక ఇందులో ప్రముఖ ర్యాపర్ గా గుర్తింపు సంపాదించుకున్న డాల్ఫ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇంతలో అక్కడికి ఓ దుండగుడు వచ్చాడు. ర్యాపర్ ని టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడ్డాడు.

 అయితే ర్యాపర్ అప్రమత్తం అయ్యేలోపే బుల్లెట్లు బాడీ లోకి దూసుకుపోయాయ్. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు ర్యాపర్.  క్యాన్సర్ తో బాధపడుతున్న తన బంధువును చూసేందుకు అక్కడికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక కాల్పులు జరిపిన దుండగుడు అప్పటికే అక్కడ నుంచి పరారై నట్లు తెలుస్తోంది.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతోంది మాత్రం ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: