భార్య నల్లగా ఉందని.. ఎంత పని చేశాడు?
భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఒకసారి దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత కలకాలం కష్టసుఖాలు పంచుకుంటూ ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమ అభిమానాలు చూపించుకుంటూ ఉండాలి. కానీ ఇటీవలి కాలంలో మాత్రం.. అమ్మో భార్యాభర్తల బంధాన్ని తలుచుకుంటేనే భయమేసే పరిస్థితులు వచ్చాయి. కట్టుకున్న వారికి తోడునీడగా ఉండాల్సింది పోయి దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
ఇక్కడ ఓ భర్త కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. భార్య నల్లగా ఉంది అన్న కారణంతో ఏకంగా భార్యకు విడాకులు ఇచ్చాడు ఇక్కడ ఒక ప్రబుద్ధుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో వెలుగులోకి వచ్చింది. బరేలీ కి చెందిన ఓ యువతికి ఆలం అనే వ్యక్తితో ఇదే ఏడాది మార్చి నెలలో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన సమయంలో ఇక అమ్మాయి తల్లిదండ్రులు ఏకంగా మూడు ఎకరాల భూమిని కట్నంగా ఇచ్చారు. కొన్నాళ్ళ వరకు వీరు సంసారం సాఫీగానే సాగిపోయింది. కానీ ఆ తర్వాత పెళ్లప్పుడు కనిపించని భార్య రంగు పెళ్లయిన కొన్నాళ్ళకి భర్తకు సమస్య అనిపించింది. దీంతో నువ్వు నల్లగా ఉన్నావు అంటూ సూటిపోటి మాటలతో భార్యను వేధించి వాడే భర్త. అదనపు కట్నం తేవాలని తరచూ పుట్టింటికి పంపించాడు.ఇక ఇటీవలే ఇక నల్లగా ఉంది అనే కారణంతో భర్త భార్యకు తాలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. ఈ క్రమంలోనే భార్య పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.