కోట్లల్లో మోసపోయిన మహేష్ బాబు సోదరి...!
ఇప్పుడు తాజాగా శిల్పా చౌదరీలో తాను కూడా మోసపోయినట్లు ప్రియదర్శిని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన నుంచి శిల్పా చౌదరీ ఏకంగా 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకున్నారని... ఆ తర్వాత డబ్బు ఇవ్వకుండా మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతి వారం కిట్టీ పార్టీలకు తనను శిల్పా ఆహ్వానించిందన్నారు. తన వద్ద డబ్బు తీసుకున్నారని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేవలం డబ్బుల కోసమే కిట్టీ పార్టీలను శిల్పా చౌదరి దంపతులు ఏర్పాటు చేసేవారని... అలా తన నుంచి ఇప్పటి వరకు మొత్తం 2.9 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు ఫిర్యాదు చేశారు ప్రియదర్శిని. ప్రిన్స్ సోదరి ప్రియదర్శిని ఫిర్యాదుపై శిల్పా చౌదరిని మరోసారి విచారించేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ఆ డబ్బులను ఎక్కడ ఉంచారనే విషయంపై విచారిస్తున్నారు పోలీసులు. శిల్పా బాధితుల్లో మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురు ప్రముఖుల నుంచి దాదాపు 50 కోట్ల రూపాయలను వసూలు చేసిన శిల్పా... ఆ డబ్బును హవాలా ద్వారా దుబాయ్ తరలించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ డబ్బును తిరిగి తెప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.