బాబోయ్ అంత బంగారం అక్కడెలా పెట్టారో మరి...!

Podili Ravindranath
ఓ వైపు కరోనా ఓమిక్రాన్ వేరియంట్ వైరస్ భయాందోళనలతో ప్రపంచం మొత్తం అల్లాడుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కూడా విధించారు అధికారులు.  ప్రతి ఒక్కరిలో కరోనా భయం వెంటాడుతున్నా కూడా... అక్రమార్కులు మాత్రం తమ చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బంగారం అక్రమ రవాణ్ చేసేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను వినియోగిస్తున్నారు కూడా. అగ్గిపుల్ల, సబ్బుబిళ్లి, కుక్కపిల్ల... కాదేదీ కవితకు అనర్హం అని మహా కవి శ్రీశ్రీ వ్యాఖ్యానించినట్లు... కాదేదీ బంగారం అక్రమ రవాణాకు అనర్హం అన్నట్లుగా పరిస్థితిని మార్చేశారు. కొంతమంది పేస్టు రూపంలో, మరి కొందరు నగల రూపంలో... రవాణా చేస్తారు. అలా తీసుకు వచ్చేందుకు కూడా రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు అక్రమార్కులు కూడా. బంగారం అక్రమ రవాణాపై ఇప్పటికే ఎన్నో సార్లు అధికారులు కూడా షాక్ అయ్యారు. అసలు విదేశాల నుంచి బంగారం తరలించేందుకు స్మగ్లర్లు ఎంత కైనా తెగిస్తున్నారు కూడా.

బంగారం భారత్లోకి ఏ రూపంలో చేరుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. గోల్డ్ స్మగ్లింగ్ కోసం విద్యార్థులు, మహిళలను కూడా వాడేస్తున్నారు. షూ సాక్స్‌లు, మిక్సీల్లో, మహిళల లో దుస్తుల్లో కూడా రవాణా చేశారు. గతంలో ఓ మహిళ అయితే తన అండర్ వేర్‌లో ఏకంగా కోటి రూపాయల విలువ చేసే బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చేసి తీసుకువచ్చారు. అయితే అనుమానంతో ఆమెను లక్నో ఎయిర్ పోర్టులో పరిశీలించిన కస్టమ్స్ అధికారులు.... బంగారం స్వాధీనం చేసుకుని అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు తాజాగా.. మరో ఘటన కస్టమ్స్ అధికారులనే ఆశ్చర్యానికి గురి చేసింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు... వారి నుంచి 7.3 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు సుడానే దేశీయుల నుంచి తమ మల ద్వారంలో ద్రవ రూపంలో దాచిన బంగారాన్ని అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన వీరి కదలికపై అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. బంగారం కరిగించి ముద్దను మల ద్వారం ద్వారా తీసుకువచ్చినట్లు గుర్తించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: