మద్యం మత్తులో అలా చేశారు.. చివరికి స్నేహితుడే నరికేసాడు?

praveen
హత్యలు, ఆత్మహత్యలు,  అత్యాచారాలు నేటి రోజుల్లో రోజురోజుకు ఇలాంటివి పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు. నేరాలకు పాల్పడితే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అన్న భయం ఎవ్వరి లో కనిపించడం లేదు. అసలు నేటి రోజుల్లో మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్నచిన్న కారణాలకే జీవితం ముగిసి పోయింది అని బాధపడుతూ మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు కొంతమంది అయితే.. చిన్న చిన్న కారణాలకే దారుణంగా హత్యలకు పాల్పడుతూ జైలుపాలు అవుతున్నవారు మరికొంతమంది.


 ఇలా నేటి రోజుల్లో మనుషుల్లో మానవత్వం కరువైపోతుంది అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. భార్యను వేధించాడు అన్న కారణంతో ఏకంగా స్నేహితులని దారుణంగా నరికి చంపాడు ఇక్కడ ఒక వ్యక్తి. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేసింది..  కర్ణాటకలోని మైసూరు నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు



 రవి అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం తాగాడు.. అందరూ ఫుల్లుగా మద్యం తాగిన సమయంలో మహేష్ భార్య అటువైపుగా వచ్చింది.  దీంతో మహేష్ స్నేహితులు బసవ, రవి అనే ఇద్దరు కూడా మహేష్ భార్యను మాటలతో వేధించారు. అయితే గతంలో కూడా ఇలా పలుమార్లు మహేష్ భార్యను  రవి బసవ లు కామెంట్ చేయడం గమనార్హం. ఇక ప్రతిసారీ ఇలానే జరుగుతుండడంతో భర్త మహేష్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు  మరో స్నేహితునితో కలిసి రవి బసవని దారుణంగా కత్తులతో నరికి చంపేసాడు మహేష్.. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే హత్య చేసి అక్కడి నుంచి పరారైన నిందితులను కేవలం గంటల వ్యవధిలో పట్టుకున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: