ఓరినాయనో.. 27 ఏళ్ళకే 70 వృద్ధురాలిగా మారింది?

praveen
ప్రస్తుత కాలంలో ఎంతోమంది మహిళలు మహిళా సాధికారత సాధించే దిశగా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎన్నో ప్రాంతాల్లో మహిళలు మగాడి చేతిలో కీలుబొమ్మ లాగానే మారిపోతున్నారు. ఎన్నో వేధింపులకు కూడా గురవుతున్నారు. అయితే మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన ఇక మహిళల రక్షణ కోసం కొత్త కొత్త సంఘాలు పుట్టుకొస్తున్న కూడా మహిళల బాధలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి. ఈ చట్టాలు, సంఘాలు మహిళలను వేధించే మృగాలను మాత్రం భయపెట్ట  లేక పోతున్నాయి అనడానికి ఇక్కడ జరిగిన ఘటన ఒక నిలువుటద్దంగా మారిపోయింది.


 ఈ ఘటనలో బాధితురాలి పరిస్థితి తెలిస్తే అందరి మనసు కదిలిపోతుంది అని చెప్పాలి. అత్తమామలు భర్త  వేధింపులు కారణంగా టీబీ వచ్చి చివరికి 27 ఏళ్ల వయసులో 70 ఏళ్ల వృద్ధురాలు లాగా మారిపోయింది సదరు యువతి. గ్వాలియర్ లోని రామ్ జీ ప్రాంతంలో నివసించే సోనియా 27 ఏళ్ళ వయసులో ప్రస్తుతం 70 సంవత్సరాల వృద్ధురాలు లాగా కనిపిస్తోంది. 2018లో గల్ఫామ్ ఖాన్ అనే వ్యక్తి తో ఆమెకు పెళ్లి జరిగింది. ఈ క్రమంలోనే అందరిలాగానే కట్నకానుకలు ముట్ట చెప్పారు సోనియా తల్లిదండ్రులు. అయితే పుట్టింటి నుంచి కారు తీసుకుని రావాలని యువతిపై భర్త ఒత్తిడి తీసుకు వచ్చేవాడు.


 అయితే వరకట్నాన్ని సోనియా వ్యతిరేకించింది. దీంతో ఇక భార్యని  వేధించడం మొదలు పెట్టాడు భర్త. ఇక అన్ని రకాలుగా చిత్రహింసలకు గురి చేశాడు. చివరికి బానిసగా మార్చుకుని ఒక గదిలో బందీగా పెట్టాడు. ఇంటి పనులకు బయటకు రావడం మళ్ళీ గదిలోకి వెళ్లడం ఇలా పూర్తిగా జైలు ఖైదీ లాగా మారిపోయింది సోనియా జీవితం. ఇలా నాలుగేళ్లుగా జైలు ఖైదీ జీవితాన్ని గడుపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే సోనియాకు కొడుకు కూతురు జన్మించారు.. ఎవరికీ సరైన ఆహారం అందక సోనియా క్షయవ్యాధికి గురైంది. అయితే సోనియాను డాక్టర్ల దగ్గరకు తీసుకు వెళ్ళకుండా మాంత్రికుడు దగ్గరికి తీసుకువెళ్ళారు భర్త.  దీంతో సోనియాకు క్షయ వ్యాధి తీవ్రమై 27 ఏళ్ల వయస్సులో  70 ఏళ్ల బామ్మ గా కనిపిస్తుంది. ఇటీవల  ఈ విషయం  బయటకు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: