ప‌సికందును చంపిన త‌ల్లి.. అందుకోస‌మేనా..?

N ANJANEYULU
ప‌సిబిడ్డ‌ను పుట్టి నెల రోజులు కూడా స‌రిగ్గా గ‌డ‌వ‌ముందుకే కొట్టి చంపింది ఆ త‌ల్లి. క‌న్న పేగు బంధాన్ని తెంచుకోవడంతో ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఆ త‌ల్లికి చంప‌డానికి మ‌న‌స్సు ఎలా వ‌చ్చిందో.. కానీ.. ఆ 27 రోజుల చిన్నారి త‌ల‌ను గోడ‌కు కొట్ట‌డంతో ప‌సికందు ప్రాణాలు విడిచింది. నెల రోజులు నిండ‌ని ఆ శిశువు క్ర‌మం త‌ప్ప‌కుండా అనారోగ్య భారిన ప‌డుతుండడంత ఆ తల్లి ఆగ్ర‌హంతో ఈ ప‌ని చేసింది. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లో చోటు చేసుకుంది.

ఈ ఘ‌ట‌న డిసెంబ‌ర్‌09న చోటు చేసుకున్నా.. కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కేర‌ళ రాష్ట్రంలోని కొట్టాయంలో నివ‌సించే ఓ మ‌హిళ ఈ ఘాతుకానికి పాల్ప‌డింది.  శిశువు ఎక్కువ‌గా ఏడ‌వ‌డంతో తల్లి ఆగ్ర‌హానికి గురై నేరం చేయ‌డానికి ప్రేరూపించినది. డిసెంబ‌ర్ 09న ఉద‌యం 11 గంట‌ల‌కు చిన్నారిని ఆసుప‌త్రికి తీసుకెళ్లి వైద్యులు సూచించిన మందుల‌తో తిరిగి ఇంటికెళ్లారు. ఆ త‌రువాత ప‌గటిపూట శిశువు ప‌రిస్థితి మారిపోయిది.. శిశువును స‌మీపంలో ఉన్న ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. అక్క‌డ మ‌ర‌ణించాడు.

స‌ద‌రు మ‌హిళ వంట గ‌దిలో ప‌ని చేసే ఆశ్ర‌మాన్ని న‌డుపుతోంది. తండ్రి జోజిథామ‌స్ ఇచ్చిన వాంగ్మూలం ఆదారంగానే పోలీసులు కేసు న‌మోదు చేసారు డిసెంబ‌ర్ 10న‌నిర్వ‌హించిన పోస్టుమార్టం త‌రువాత .. పోలీస్ అధికారి స‌ర్జ‌న్‌తో మాట్లాడి.. పిల్ల‌వాడి త‌ల వెనుక భాగంలో గాయాలున్నాయ‌ని క‌నుక్కొన్నారు. శిశువు స‌న్న‌ని పుర్రె కార‌ణంగా గాయం క‌నిపించ‌లేద‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఆ అధికారి పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌ను క‌లుసుకుని వారిని కూడా ప్ర‌శ్నించిన‌ట్టు వెల్ల‌డించారు. మ‌హిళా కొంత మాన‌సికంఆ ఇబ్బంది ప‌డుతుండ‌డంతో పోలీసులు మాత్రం వివ‌రాలను స‌రిగ్గా తెలుసుకోలేక‌పోయామ‌ని పేర్కొన్నారు.

 ముఖ్యంగా ఆ మ‌హిళ గురించి ఆరాతీయ‌గా స‌ద‌రు మ‌హిళ ఓ వ్య‌క్తితో ఫోన్‌లో క‌లుసుకున్నార‌ని, ఆశ్ర‌మంలో క‌లిసి జీవించ‌డం ప్రారంభించిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. తండ్రికి అప్ప‌టికే పెళ్లి జ‌రిగింద‌ని.. ఆ మ‌హిళ అత‌నితో స‌హ‌జీవ‌నం చేస్తుంద‌నే విష‌యం వెలుగులోకి వ‌చ్చిన‌ది. ఈ విచార‌ణ‌లో క‌న్న తల్లినే బిడ్డ‌ను హ‌త్య చేసింద‌ని తేల‌డంతో పోలీసులు ఆ త‌ల్లిని అరెస్ట్ చేసారు. అయితే మ‌రొవైపు కొట్టాయంలోని ఓ ప్ర‌యివేటు ఇన్‌స్టిట్యూట్ లో  ఆ మ‌హిళ చ‌దువుతుంద‌ని.. ఫోన్‌లో ప్రేమికుడితో సంభాషించార‌ని.. అనంత‌రం క‌లిసార‌ని, ఆ ప‌సిపాప త‌న చ‌దువ‌కు హాని క‌లిగిస్తుంద‌నే బిడ్డ‌ను చంపాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: