దారుణం : చితికిన విద్యార్థుల బ‌తుకులు.. ఎక్క‌డంటే..?

N ANJANEYULU
నిండు నూరేండ్లు బ్ర‌త‌కాల్సిన వారి బ‌తుకులు విద్యార్థి ద‌శ‌లోనే చితికి పోయాయి. అనుకోకుండా అక‌స్మాత్తుగా జరిగిన ప్ర‌మాదంలో వారు మృత్యువాత ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు తిరునెల్వేలిలో చోటు చేసుకున్న‌ది.  ఒక పురాత‌న పాఠ‌శాల‌లో ఊహించ‌ని ప్ర‌మాద‌మే చోటు చేసుకున్న‌ది. టాయిలెట్ గోడ కుప్ప‌కూల‌డంతో ముగ్గురు విద్యార్థులు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రొక ఇద్ద‌రూ స్టూడెంట్స్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

తిరునెల్వేలి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌కు స‌మీపంలో ఉన్న స్కాప్ట‌ర్  హై స్కూల్ అత్యంత పురాత‌న‌మైన‌ది కావ‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. శుక్ర‌వారం ఉద‌యం ఆ హై స్కూల్‌లోని టాయిలెట్ గోడ ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. అక్క‌డే ఉన్న ఎనిమిదోత‌ర‌గ‌తి విద్యార్థుల‌పై శిథిలాలు ప‌డ‌డంతో వారు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ముఖ్యంగా ముగ్గురు విద్యార్థులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. గాయ‌ప‌డిన వారిలో మ‌రొక ఇద్ద‌రు విద్యార్థుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తూ ఉన్నారు.
 
సంబంధిత అధికారులు ఘ‌ట‌న స్థ‌లాన్ని ప‌రిశీలించి.. ద‌ర్యాప్తును చేప‌డుతూ ఉన్నారు. ముగ్గురు విద్యార్థులు చనిపోవ‌డంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెల‌కొన్న‌ది. మ‌రోవైపు 100 ఏండ్ల‌కు పైగా న‌డుస్తున్న స్కూల్‌లో బిల్డింగ్స్, గోడ‌లు శిథిలావ‌స్థ‌కు చేరుకున్నా.. వాటిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స్థానికులు పేర్కొంటున్నారు. విద్యార్థుల‌కు విద్యాబుద్దులు నేర్పి నిండు భ‌విష్య‌త్‌కు బాట‌లు ప‌రుచుకునే చోట‌.. వారి జీవితాలు అంత‌మైన ఘ‌ట‌న అంద‌రినీ క‌న్నీరు పెట్టిస్తున్న‌ది.

ఇప్ప‌టికే విద్యార్థుల మృతి ప‌ట్ల త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ తో పాటు మంత్రులు కూడా సంతాపం తెలిపారు. మ‌రోవైపు తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర్య రాజ‌న్ సంతాపం ప్ర‌క‌టించారు. అదేవిధంగా బాధితుల కుటుంబాల‌కు ఆమె ధైర్యాన్ని నింపారు. విద్యార్థులు మృతి చెందార‌ని స‌మాచారం తెలుసుకున్న త‌ల్లిదండ్రులు అక్క‌డికి చేరుకుని త‌ల్ల‌డిల్లిపోయారు. కొద్ది ఆ పాఠ‌శాల ప్రాంగ‌ణం ముందు కొంత మంది ధ‌ర్నా నిర్వ‌హించారు. కొద్దిగా ఆందోళనక‌ర వాతావ‌ర‌ణం ఉండ‌గా.. పోలీసులు అక్క‌డికి చేరుకుని స్కూల్‌పై దాడి చేయ‌కుండా కాప‌లా కాసారు.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: