ప్రేమమత్తు : ఆమె అలా.. ఈయన ఇలా..?
ఈ ఘటన బెంగుళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే హసన్ జిల్లాలోని చన్నారాయపట్నానికి చెందిన సాకమ్మ(24) యశ్వంత్పుర్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నది. అక్కడే ఆమెకు అరుణ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి.. వీరిద్దరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. కొద్ది రోజులు బ్రతిమిలాడగా.. అరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకునేందుకు అంగీకరించగా.. సాకమ్మ తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అన్నారు. అరుణ్ తన ప్రేయసితో పెళ్లి కోసం ఒక దారుణమైన ప్లాన్ వేసాడు.
తన ఫ్రెండ్ గోపాల్ చేత సాకమ్మ తల్లికి, బావకు పోలీస్ లా ఫోన్ చేయించి అరుణ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని, దానికి కారణం మీరే అని, మీ అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేయండి లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పించాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న సాకమ్మ.. తన కోసం ప్రియుడు మృతిచెందాడనుకొని.. తాను లేని జీవితం నాకు వద్దని ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందినది. అరుణ్‌తో పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదని.. తాను లేకుండా నేను బతకలేనని లేఖలో పేర్కొని ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరుణ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు.