అయ్యో.. పాటలు వినడమే.. ప్రాణం తీసింది?

praveen
నేటి రోజుల్లో యువత ప్రాణాలను అస్సలు లెక్క చేయడం లేదు. ఇటువైపుగా వెళ్ళకండి ప్రాణాపాయం ఉందని అంటూ చెబితే.. అటువైపుగా వెళ్లకుండా జాగ్రత్త తీసుకునే వారికంటే అటు వైపు వెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం అంటూనిర్లక్ష్యంగా వ్యవహరించే వారే ఎక్కువ అయిపోతున్నారు. ముఖ్యంగా మొబైల్ వాడకం పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా మొబైల్ వాడుతున్నారు. ఇక మొబైల్లో చూస్తూ నడవడం కారణంగా ఇప్పటికే ఎన్నో రకాల ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా రోడ్డు దాటుతున్న సమయంలో... లేదా బస్సు ఎక్కుతున్న సమయంలో పూర్తిగా ఫోన్ లో నిమగ్నమై  దృష్టి మొత్తం ఫోన్ మీద ఉండటం కారణంగా ఎన్నో ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతోమంది.



 అదే సమయంలో ఇక మొబైల్ లో పాటలు వినాలి అంటే ప్రతి ఒక్కరూ ఇయర్ ఫోన్స్  వాడుతున్నారు. ఇయిర్ ఫోన్స్ ఒక్కసారి చెవిలో పెట్టుకున్నారు అంటే పక్కన ఎంత పెద్ద శబ్దం వచ్చిన కూడా వినిపించదు అన్న విషయం తెలిసిందే. ఇలా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే  ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడం ఎన్నో ప్రాణాలు పోవడానికి కారణమైంది. పాటలు వింటూ హాయిగా రైలు పట్టాలు దాటుతు ఉన్నాడు సదరు యువకుడు. కానీ రైలు దూసుకు రావడాన్ని మాత్రం గ్రహించలేకపోయాడు. అయితే రైల్లో లోకో పైలెట్ హారన్ మోగించిప్పటికి అతను చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటం వల్ల రైలు వస్తున్న శబ్దం వినిపించకపోవడం తో చివరికి ప్రాణం పోయింది.


 ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్కు చెందిన ప్రభు కుమారుడు నరేష్ నగరంలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ బొలారం బజార్ బొల్లారం రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఏకంగా అటువైపుగా రైలు దూసుకు వచ్చింది. ఇయర్ ఫోన్స్ ఉండడంతో ఇక రైలు శబ్దాన్ని గమనించలేకపోయాడు.  రైలు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన అతని స్థానికులు ఆసుపత్రికి తరలించగా చివరికి చికిత్స పొందుతూ మృతి చెందాడు నరేష్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: