ప్రియుడా.. కామందుడా.. ఇలా చేశాడేంటి?

praveen
ప్రేమ అనేది ఒక మధురానుభూతి.. ప్రేమలో పడిన తర్వాత ఈ లోకాన్నే మరిచిపోతారు. అయితే ప్రియురాలికి చిన్న కష్టం వచ్చినా కూడా ప్రియుడు అస్సలు తట్టుకోలేడు. ఆ కష్టం రాకుండా తానే ముందు నిలబడి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఏకంగా ప్రియురాలికి రక్షణ కవచం గా నిలుస్తూ ఉంటాడు ప్రియుడు.  కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా ప్రేమనే తన అవసరాలకు వాడుకున్నాడు. ప్రియురాలిని మాయ మాటలతో నమ్మించి ప్రేమపేరుతో నటించి శారీరక అవసరాలు తీర్చుకున్నాడు.. అంతేకాదు ఏకంగా ప్రియురాలిని స్నేహితులకు విందు గా మార్చేశాడు. ప్రియురాలిని పరాయి మగాడు కన్నెత్తి చూస్తే తట్టుకోలేడు ప్రియుడు.. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ప్రియురాలిని స్నేహితులకు అప్పజెప్పాడు.



 ప్లీజ్ వద్దు నన్ను వదిలేయ్ అంటూ ప్రేమించిన ప్రియురాలు ఎంతలా కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నా కూడా వదలలేదు. ఇలా ఏకంగా ప్రియురాలిని స్నేహితులతో అత్యాచారం చేయించిన ఘటన తమిళనాడులోని నామక్కల్ లో వెలుగులోకి వచ్చింది.. బీహార్కు చెందిన ఓ యువతి తమిళనాడులోని నామక్కల్ లోని వెర్పేడు ప్రైవేట్ మిల్లులో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అక్కడ పనిచేస్తున్న బాలరాజ్ అనే యువకుడితో ఈమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో పలుమార్లు బాలరాజ్  ఆ యువతి పై  శారీరక అవసరాలను తీర్చుకున్నాడు. ఇటీవల ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రియురాలిని తన ఇంటికి తీసుకెళ్లాడు బాలరాజు.


 ఇక కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో కేవలం ప్రియుడు  మాత్రమే ఉంది అనుకొని భావించింది యువతి. కానీ అంతలోనే ఇంట్లో శబ్దం అయింది. యువతికి ఏదో అనుమానం వచ్చి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే బాలరాజ్  మరోసారి ప్రియురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు అదే ఇంట్లో ఉన్న బాలరాజ్ స్నేహితులు ప్రదీప్ మనోజ్ లకు తన ప్రియురాలి అప్పగించాడు. ఈ క్రమంలోనే ముగ్గురు కలిసి సదరు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణంగా హింసించారు. దీంతో యువతి స్పృహ కోల్పోయింది. అర్ధరాత్రి సమయంలో స్పృహలోకి వచ్చిన యువతి తనకు జరిగిన అన్యాయం గురించి తెలిసి కేకలు పెట్టడంతో ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: