ఇల్లు నచ్చలేదని.. వెళ్ళిపోయిన నవ వధువు?

praveen
భార్యాభర్తల బంధానికి నేటి రోజుల్లోఅసలు విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత కష్టసుఖాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. అంతేకాదు ఒకరి అభిప్రాయాలను అలవాట్లను ఇష్టాలను కూడా ఒకరు గౌరవిస్తూ ఉండాలి. కానీ నేటి రోజుల్లో భార్య భర్తల బంధం లో మాత్రం అలాంటిది ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పవచ్చు.. మూడుముళ్ల బంధంతో ఒకటవుతున్నా వారు  సుఖాల్లో తోడు ఉంటామ్ కానీ కష్టాల్లో మాత్రం తోడు ఉండటం మా  వల్ల కాదు అంటూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే భర్తతో కాస్త కష్టం కలిగింది అంటే చాలు చివరికి ఏకంగా భర్తను వదిలేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఎంతోమంది.



 అంతేకాదు చిన్న చిన్న కారణాలకు భర్తతో గొడవలు పెట్టుకుంటూ చివరికి కాపురంలో చేతులారా చిచ్చు పెట్టుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుని అత్తారింట్లో కోటి ఆశలతో అడుగుపెట్టింది ఆ యువతి. కానీ అత్తారిల్లు చూసిన తర్వాత మాత్రం ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని ఫీల్ అయింది.  ఎందుకంటే అత్తారిల్లు బంగ్లా  అనుకుంటే చివరికి పాత ఇళ్ళు ఉండటంతో ఆ ఇంట్లో ఎలా ఉండాలో అర్థంకాక ఎంతగానో ఇబ్బందిగా ఫీల్ అయింది. దీంతో ఇక పెళ్లి చేసుకున్న భర్తను వదిలేయడమే కరెక్ట్ అంటూ సంచలన నిర్ణయం తీసుకుంది.


 రంగారెడ్డి జిల్లా కుర్మిద్ద లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తికి విజయవాడకు చెందిన మహిళతో డిసెంబర్ 17వ తేదీన పెళ్లి జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల అత్తవారింటికి వచ్చింది సదరు యువతి. కానీ భర్త ఇంటిని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. బంగ్లా ఉంది అన్నావ్ ఇది పాత ఇల్లు అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇక ఆ మర్నాడే కడుపునొప్పి వస్తుంది అంటూ భర్తను టాబ్లెట్ కోసం బయటకు పంపించి తన వెంట వచ్చిన మరో మహిళతో కార్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక భర్త పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి ఆచూకీ కనుగొని విచారించగా తనను భర్త మోసం చేశాడని అందుకే భర్త నుంచి దూరంగా వచ్చేసాను అంటూ సమాధానం చెప్పేసింది ఆ యువతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: