వీడి దుంపదెగా : ఎంత చలి పుడితే మాత్రం.. ఇలా చేస్తారా?

praveen
సాధారణంగా చలికాలం వచ్చింది అంటే చాలు ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి జనాలు భయపడిపోతుంటారు. ఎముకలు కొరికే చలిలో ఎటు తిరగకుండా ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బయటికి వెళ్లడం కాదు ఇంట్లో కూర్చున్నా చలితో వణికి పోయే పరిస్థితి ఏర్పడింది. చలి ప్రభావం నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరు ఎన్నో రకాలుగా ప్రయత్నం కూడా చేశారు. చాలా మంది ఒక మంట వేసుకొని చుట్టూ కూర్చుని ముచ్చట్లు పెట్టడం లాంటివి కూడా చేశారు..


 అయితే సాధారణంగా ఎవరైనా చలి వేస్తోంది అంటే కాస్త మంట వేసుకుని వేడి తగిలేలా దగ్గరగా కూర్చోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు..  కానీ అందరిలా కాదు కాస్త డిఫరెంట్ గా ట్రై చేసాడు. అందరూ కట్టెలతో మంట వేసుకుంటే ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా  చలికాచుకునేందుకు ఒక బైక్ ని తగలబెట్టేసాడు. ఆశ్చర్య పోతున్నారు కదా.. కానీ ఈ ఘటన నాగపూర్ లో నిజంగానే చోటు చేసుకుంది. ఇలా బైక్ ని తగలబెట్టింది యజమాని కాదులేండి ఏకంగా బైక్లను చోరీ చేసిన దొంగ.


 నాగపూర్ లోని యశోద నగర్ లో ఇటీవలే కొన్ని రోజుల నుంచి పలు బైకులు చోరీకి గురవుతున్నాయి. దీంతో పలువురు వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బైక్ చోరీలకు పాల్పడుతున్న ఒక ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. ఇక ఈ  తమదైన శైలిలో విచారించగా ఏకంగా పది బైక్ లను దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. అయితే కేవలం తొమ్మిది వాహనాలను మాత్రమే పోలీసులు దొంగలు నుంచి రికవరీ చేయగలిగారు.  ఇక 10వ బైక్ దొంగలించిన సర్పరాజ్ ను ప్రశ్నించగా అతను చెప్పిన సమాధానంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు పోలీసులు.. చలి ఎక్కువగా ఉందని చలికాచుకునేందుకు బైక్ కు నిప్పు పెట్టాను అంటూ పోలీసులకు సమాధానం చెప్పాడు సర్ఫరాజ్ అనే దొంగ. దీంతో షాకైన పోలీసులు వీరిని రిమాండుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: