మరీ ఇంత దారుణమా.. అంకుల్ అని పిలిచినందుకు?
దారుణంగా బాలికపై దాడి కి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌లోని సీతర్ గంజ్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. 18 ఏళ్ల బాలిక బాడ్మింటన్ ఆడటం కోసం ఒక రాకెట్ ను కొనుగోలు చేసింది. అయితే ఆ రాకెట్ ఇక ఆట మధ్యలోనే పాడైపోయింది. దీంతో ఇక రాకెట్ తీసుకొని కొనుగోలు చేసిన షాప్ కి వెళ్ళి రాకెట్ ఇంత తొందరగా పాడైపోవడం ఏంటి అంటూ ప్రశ్నించాలి అనుకుంది. అయితే షాప్ లో ఎవరు కనిపించకపోవడంతో అంకుల్ ఎవరైనా ఉన్నారా అని పిలిచింది ఆ బాలిక. కానీ అదే షాపులో మాటువేసి ఉన్న మానవ మృగం ఉంది అని మాత్రం ఆ బాలిక గ్రహించలేక పోయింది.
ఈ క్రమంలోనే ఇక షాపు యజమాని మోహిత్ ఆగ్రహంతో ఊగిపోయాడు.. నన్నే అంకుల్ అని పిలుస్తావా అంటూ షాప్ నుంచి బయటకు వచ్చి ఇక బయట నిలబడి ఉన్న బాలిక జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టాడు. అంతటితో ఆగకుండా విచక్షణారహితంగా చితకబాదాడు షాపు యజమాని. గమనించిన స్థానికులు తీవ్ర గాయాలపాలైన బాలికను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలిక కోలుకుంటుంది అయితే విషయం తెలుసుకున్న పోలీసులు బాలిక పై దాడి చేసిన షాప్ యజమాని పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి తోసారు.