దారుణం : కరోనా సోకిన బాలికతో వ్యభిచారం.. చివరికి?

praveen
టెక్నాలజీ పెరిగిపోతుంది. మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.. అదే సమయంలో మనిషిలో మానవత్వం కూడా రోజు కనుమరుగు  అవుతుంది అన్నది అర్థం అవుతుంది. నేటి సభ్య సమాజంలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని విధంగా మారిపోయింది పరిస్థితి.. తియ్యగా మాట్లాడుతూ పరిచయం పెంచుకుని చివరికి సమయం చూసి అసలు స్వరూపం బయట పెడుతున్నారు ఎంతో మంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. తల్లి ప్రేమకు దూరమైన బాలికకు అండగా ఉంటామంటూ మాయ మాటలతో నమ్మించి చివరకి  జీవితాన్ని నాశనం చేశారు. వ్యభిచార రొంపిలోకి దింపి చిత్రహింసలకు గురిచేశారు.


 ఇలా అభం శుభం తెలియని బాలిక జీవితంతో ఆటలాడి జీవితాన్ని నాశనం చేసిన ఇరవైఒక్క మంది నిందితులను  పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలానికి చెందిన 13 ఏళ్ల బాలికకు జూన్ 26వ తేదీన కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో పాఠశాల నుంచి ఇంటికి తీసుకు రాగా ఇక బాలిక నుంచి తల్లికి కూడా కరోనా వైరస్ సోకింది. దీంతో బాలిక తల్లి ఆరోగ్యం క్షీణించడంతో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. ఈ క్రమంలోనే తల్లి ప్రేమకు దూరమైన బాలికకు గుంటూరు ద్వారకా నగర్ కు చెందిన స్వర్ణకుమారి పరిచయమైంది.


 కరోనా వైరస్ కు మందు ఇప్పిస్తాను అంటూ తండ్రి, బాలికను మాయ మాటలతో నమ్మించి తీసుకెళ్ళింది.. ఇక ఆ తర్వాత స్థానికంగా ఉన్న చైతన్యపురిలో బాలికను నిర్బంధించి బలవంతంగా దాడి చేసి మరీ వ్యభిచారం చేయించడం మొదలు పెట్టింది. తండ్రి ఫోన్ చేసినప్పుడల్లా కరోనా వైరస్ చికిత్స అందిస్తున్నాము అంటూ మాయ మాటలతో మభ్య పెట్టింది. విజయవాడ,హైదరాబాదు, నెల్లూరులో తెలిసిన వారికి అప్పగించి బాలికతో వ్యభిచారం చేయడం మొదలుపెట్టింది. ఇక ఇటీవల ఎంతో చాకచక్యంగా బాలిక స్వర్ణకుమారి నుంచి తప్పించుకుంది. ఇక ఆ తర్వాత మరో వ్యభిచార నిర్వాహకురాలు శారద మాయమాటలతో నమ్మించి బాలికను మరొకరికి విక్రయించింది. దీంతో బాలిక అనారోగ్యానికి గురి అయింది.ఇక ఆ తర్వాత ఎలాగోలా తప్పించుకుని తండ్రి వద్దకు చేరుకుని జరిగిన విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడుతండ్రి. ఇక పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి ఏకంగా ఇరవైఒక్క మందిని అరెస్టు చేసి పోక్సో  చట్టం కింద కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: