మద్యం మత్తుకు.. బలైన మరో యువతి?

praveen
ఇటీవలికాలంలో మద్యం మత్తు ఎన్నో ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది. ఎంతోమంది ఫుల్లుగా మద్యం తాగుతూ రోడ్డు నిబంధనలను ఉల్లంగించి చివరికి వాహనం నడపడం లాంటివి చేస్తున్నారు. దీంతో ఇక ఎంతో మంది రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా వస్తున్నాయ్. మద్యం మత్తులో  వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల బారినపడి జీవచ్ఛవాలుగా మారిపోతున్న వారు కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలు కోల్పోతున్న వారు ఇంకొంతమంది. ఏదేమైనా ఎన్నో కుటుంబాలు ఇలా మద్యం మత్తు కారణంగా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది అని చెప్పాలి.


 అయితే కొన్ని కొన్ని సార్లు కొంతమంది మద్యం మత్తులో వాహనం నడపడం కారణంగా అభం శుభం తెలియని ఎంతో మంది అమాయకులు బలి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.మద్యం మత్తులో వేగంగా వాహనాలు నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న వేరే వాహనాన్ని ఢీ కొట్టడంతో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. ఇక్కడ కూడా ఇలాంటి ఘటనే జరిగింది.. మొయినాబాద్ సమీపంలో ముగ్గురు యువతులు ఒక స్కూటీపై వెళ్తున్నారు. చేవెళ్ల నుంచి హైదరాబాదుకు అతి వేగంగా వస్తున్న కారు వారి స్కూటీని బలంగా ఢీకొట్టింది. అయితే స్కూటీ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువతులు కూడా కింద పడిపోయారు  అయితే ఇందులో ఒక యువతి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.


 ఇక రోడ్డు ప్రమాదానికి గమనించిన స్థానికులు యువతులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో యువతి మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సంఘటనా స్థలంలో ప్రమాదానికి గురైన కారును అక్కడే వదిలేసి డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడం కారణంగానే ఈ ప్రమాదంజరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు మృతిచెందడంతో  ఆ కుటుంబం అరణ్యరోదనగా విలపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: