సీరియల్ పిచ్చి.. 19 లక్షల నష్టం.. ఏం జరిగిందంటే?
ఇలా ఇక్కడ మహిళలకు ఉన్న సీరియల్ పిచ్చి ఏకంగా లక్షల నష్టాన్ని కలిగించింది. తమిళనాడులో ఈ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలు ఇంట్లో టీవీ సీరియల్ చూస్తూ నిమగ్నమైపోయారు.ఆ సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు యాదేచ్చగా దొంగతనానికి పాల్పడ్డారు. 19 లక్షల రూపాయలు కాచేశారు. వివరాల్లోకి వెళితే ఇద్దరు మహిళలు రాత్రి సమయంలో తమకు ఇష్టమైనసీరియల్ వచ్చిందని టీవీ చూస్తూ నిమగ్నమైపోయాడు. ఇక రాత్రి పదకొండు దాటింది. ఇంట్లోఇద్దరు మహిళలు తప్ప ఇంకెవరూ లేరు. మొత్తం సిరీయల్ లో మునిగితేలుతున్నారు ఇద్దరు మహిళలు.. ఈ కార్యక్రమంలో ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. చప్పుడు అయినప్పటికీ మహిళలు మాత్రం టీవీ సీరియల్ లో మునిగిపోవడంతో ఎంతో ధైర్యంగా ఇంట్లోకి వచ్చి విలువైన వస్తువులను వెతికి మరీ 19 లక్షలు ఎత్తుకెళ్లారు. చూస్తుండగానే అంతా నిమిషాల్లో జరిగిపోయింది. ఇక దొంగలు ఇంత చేస్తున్నా అటు ఇద్దరు మహిళలు మాత్రం టీవీ పిచ్చి లోనే ఉండిపోయారు. ఇక చివరికి సీరియల్ ముగిసిన తర్వాత చూసేసరికి చోరీ జరిగినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.