ఛీ..ఛీ.. ఇదేం పని స్వామీ ?
భారత దేశంలో స్వామీజీ లంటే చాలా మందికి ఎనలేని భక్తి, విశ్వాసం. వారి మాటలను, ఉపన్యాసాలను చాలామంది పాటిస్తుంటారు. అందవల్లనే కాబోలు దేశంలో స్వామీజీలు, ఆశ్రమాల సంఖ్య చాలా ఎక్కువ. అయితే అది కొద్ది స్వామీజీల పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగాఆశ్రమాలు, స్వామీజీల పై ఉన్న నమ్మకం కాస్తా సన్నగిల్లుతోంది. తాజాగా ఈ స్వామీజీ పై ఆరోపణలు వెల్లువెత్తాయి.. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసా ?
యాదాద్రి భువనగిరి జిల్లాలో స్వామీజీ శ్రీరామానంద ప్రభు పై ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పోలీసుల చర్యను స్థానికులు నిరశించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ జిల్లాలోని పెద్దపర్వతాపూర్ గ్రామ సరిహద్దులో శ్రీరామానంద ప్రభు అనే స్వామీజీ సాయిధామన్ అనే ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో కొంత కాలం క్రితం ఆశ్రయం పొందిన యువతి ఇటీవల పోలీసులుకు ఫిర్యాదు చేశారు. తన పై లైంగిక దాడి జరిగిందని ఆరోపించారు. స్వామీజీనే తనపై లైంగిక దాడి చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కోన్నారు. దీంతో పోలీసులు విచారణ నిమిత్తం శ్రీరామానంద ప్రభు ను అరెస్టు చేశారు. ఇది జిల్లాలో సంచలనం కలిగించింది. స్థానికులు మాత్రం స్వామీజీకి మద్దతుగా నిలిచారు.
ఈ కేసు పూర్వాపరాలను ఒక సారి పరిశీలిస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితం ఒక ఆడ శిశువు లభ్యం కావడంతో ఆ చిన్నారిని నల్గోండ లోని శిశు విహార్ కు తరలించారు. కారణాలు తెలియడం లేదు కానీ, ఆ తరువాత 2004లో ఆ బాలికను పెద్దపర్వతాపురంలోని ఆశ్రమానికి చేరింది. అక్కడే విద్యనభ్యు సించింది. 2018లో పదో తరపది ఉత్తీర్ణురాలైంది. ఆ తరువాత అధికారులు ఆమెను ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్ లోని స్టేట్ హోంకు తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడే ఉందని అధికారులు తెలిపారు. కాగా ఈ యువతి గతంలో తన పై చాలా మార్లు లైంగిక దాడి జరిగిందని తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసారు. 2016 నుంచి 2018 మధ్య కాలం లో స్వామీజీనే తనపై లైంగిక దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అశ్రమం వద్దకు వచ్చి స్వామీజీని అరెస్టు చేశారు. స్థానికిలు మాత్రం స్వామీజీ మంచి వారని, అరెస్టు చేయడం అన్యాయమని పోలీసులతో వాగ్వీవాదానికి దిగినట్లు తెలిసింది. మహిళా సంఘాలు బాదితురాలనికి మద్దతుగా నిలిచాయి. తమ ఆశ్రమంలో ఆశ్రయం పొందిన మహిళపై నే లైంగిక దాడి జరిగిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవచ్చని, పూర్తిస్తాయి విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు మాత్రం దీని వెనుక కుట్ర ఉందని, దానిని కూడా బైటపెట్టేలా పోలీసుల విచారణ జరగాలని కోరుతున్నారు.