పెళ్ళైన మహిళతో యువకుడు ఎఫైర్.. చివరికి..
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామానికి చెందిన భార్యాభర్తలు స్థానికంగా ఉపాధి లేకపోవడంతో పిల్లలతో కలసి నెల్లూరు జిల్లాకు వలస వచ్చారు. ఇక్కడ తెలిసిన వారి సహాయంతో భర్త ఉపాధి వెదుక్కున్నాడు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతి పల్లెపాలెంలోని రొయ్యల చెరువు వద్ద కాపలాకి వచ్చారు. ఆ క్రమంలో స్థానిక యువకుడు పొన్నవాడ నరేంద్రతో వివాహితకు పరిచయం ఏర్పడింది. ఆ పరియచం కాస్తా చనువుగా మారింది. ఆ బంధం కాస్త మరింత బలపడింది.
ఈ విషయం పై ఆమె భర్త ఎన్నిసార్లు హెచ్చరించినా వాళ్ళ తీరు మారలేదు. కాగా,శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామానికి వారు తిరిగొచ్చేశారు. కానీ వివాహితతో అతడి ప్రేమ మాత్రం ఆగలేదు. వారి వెనకాలే నరేంద్ర కూడా తామాడ గ్రామానికి వచ్చాడు. అక్కడ కూడా పంచాయితీ పోలీస్ స్టేషన్ కి చేరింది. చివరకు లావేరు పోలీసులు ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కానీ ఆ యువకుడు ఆగలేదు. కొత్త సంవత్సరం రోజున ఆమెను చూసేందుకు మళ్లీ తామాడ వెళ్లాడు. డిసెంబర్ 31న మరోసారి గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ యువకుడు కనిపించలేదు. ఓ రోజు శవమై తెలాడు. అతని ఫోన్ ఆధారంగా అతని బంధువులకు సమాచారం అందించారు..అక్రమ సంబంధాల మోజులో ఆ యువకుడు బలైపోయాడు. పెద్దల వద్ద పంచాయితీ జరిగినప్పుడు కానీ, లేక పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినప్పుడు కానీ ఆగి ఉండాల్సింది.అలా జిల్లాలు దాటి వెళ్ళి ప్రాణాలను కొల్పొయాడు.