దేవుడా.. సోషల్ మీడియాను కూడా వదల్లేదుగా..!

Satvika
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ఎంత ఫెమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాను మ్యానెజ్ చేయాలంటే పెద్దగా చదవాల్సిన పని లేదు అని ప్రముఖులు అంటున్నారు. ఇప్పుడు ఇది నిజం అని ఒక మహిళ నిరూపించింది. ఆమె సోషల్ మీడియాను తెగ వాడేస్తుంది.ఫేస్ బుక్ ద్వారా ఓ యువకుడ్ని పరిచయం చేసుకుంది. పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది. అది కాస్త భర్తకు తెలియడంతో.. భర్త అడ్డుతొలగించుకునేందుకు ప్రియుడు, అతని స్నేహితుడితో పక్కా స్కెచ్ వేసింది.

ఆ ప్లాన్ ప్రకారం కట్టుకున్న భర్తను హత్య చేయించింది. అనంతరం మృత దేహాన్ని మాయం చేసే క్రమంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయి ,ఊచలు లెక్కబెడుతున్నారు నిందితులు. వివరాల్లొకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం బుద్ధారం గ్రామానికి చెందిన మొద్దు మాధవి, వెంకటేష్‌కు 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి అనంతరం వెంకటేష్ ఇల్లరికం వచ్చి అత్త, మామ ఊర్లోనే ఉంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు శివరాం, సతిష్, సంగీత ఉన్నారు. మొద్దు మాధవి రోజు వారి కూలీ గా బుద్ధరం గ్రామపంచాయతీలో పనిచేస్తుంది. వీరి జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో 6 నెలల క్రితం మొద్దు మాధవి వాళ్ళ తండ్రి మరణించడంతో రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు వచ్చాయి.

దాంతో ఫోన్ కొన్నది.. అయితే పేస్ బుక్ ను ఎక్కువగా చూసెది. అందులో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అది వారి మధ్య సంబంధానికి దారి తీసింది. అది కొద్ది రోజులకు భర్తకు తెలిసింది..భర్త మందలించాడు. అయితే ఆమె భర్త అడ్డు తొలగించాలని ప్లాను చేసి, ప్రియుడిని రమ్మని భర్తను అతి కిరాతకంగా చంపించింది. కాగా, రాత్రి శవాన్ని మాయం చేసే ప్లాను చేసింది.పోలీసులు పెట్రోలియం నిమిత్తం తిరుగుతూ వీరిని గమనించారు. వెంటనే వారిని ఆడ్డగించి ప్రశ్నించారు. మద్యం మత్తులో ఉన్నాడని ఇంటికి తీసుకెళుతున్నామని సమాధానం చెప్పడంతో అనుమానంతో తట్టి చూశారు. వెంకటేష్ అప్పటికే మృతి చెంది ఉండడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయట పడింది.. ఆమెను అరెస్ట్ చేశారు. ముగ్గురూ పిల్లలు అనాధలు అయ్యారు. వారిని గ్రామ సర్పంచ్ అక్కున చేర్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: