దుర్గమ్మ.. ఇలా జరిగిందేంటమ్మా?
ఏడుపాయలు మంగళ స్నానాలు ఆచరించి దుర్గమ్మ తల్లి ని కొలుస్తూ వుంటారు. కోరిన కోరికలు తీర్చే బంగారు దేవతగా వనదుర్గా మాత ఏడుపాయల క్షేత్రంలో విరాజిల్లుతోంది. అయితే భక్తులకు రక్షగా నిలిచే ఆ దుర్గమ్మ గుడికి ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది అని అర్థమవుతుంది. ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఏడు పాయల వన దుర్గ మాత ఆలయం లో ఇటీవలే హుండీ చోరీ జరగడం కలకలం రేపింది. అయితే చుట్టూ ఎంతో పకడ్బందీగా సీసీ కెమెరాలతో నిఘా ఉన్నప్పటికీ దొంగలు రెచ్చిపోయారు. ఈ క్రమం లోనే హుండీ లో ఉన్న నగదు మొత్తం దొంగలించినట్లు తెలుస్తోంది.
గర్భగుడి లోకి ప్రవేశించిన దొంగలు హుండీ పగలగొట్టి అందులో ఉన్న నగదు కానుకలను ఎత్తుకెళ్లినట్లు కూడా ఆలయ అధికారులు తెలిపారు. ఈ క్రమం లోనే ఇక ఆలయ అధికారులు ఉదయం వచ్చి చూసి ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం తో ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. అయితే ఇక ఆలయం పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని ఆలయ అధికారులు పోలీసులకు అందజేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అంటూ హామీ ఇచ్చారు.