అన్న నీ కాళ్ళు మొక్కుతా వదిలేయ్.. దుర్మార్గుడు కనికరించలేదు?
ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం గా మారిపోయింది. ఇటీవలే బాధిత బాలిక స్కూల్ నుంచి ఇంటికి వచ్చి చెరుకు కోసం పక్కనే ఉన్నా జీడి తోట లోకి వెళ్ళింది. అప్పటికే కాపు కాచుకుని కూర్చున్న నిందితుడు నాగేష్ ఆమె వెంట వెళ్ళి బెదిరింపులకు పాల్పడ్డాడు. అన్న నన్ను ఏం చేయొద్దు అంటూ కాళ్లావేళ్లా పడినా ఎక్కడ వినిపించుకోలేదు. దారుణంగా అఘాయిత్యం చేయడమే కాదు బాలికను వీడియో తీసి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులు పాల్పడ్డాడు. అంతేకాదు బాధితురాలి సోదరుని తల్లిని సైతం వీడియో తీసి తన మొబైల్ కు పంపించాలి అంటూ బెదిరించాడు.
అయితే స్కూల్ నుంచి వచ్చిన కూతురు కనిపించడం లేదు అంటూ కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఇక రాత్రి తొమ్మిది గంటల సమయంలో బాలిక ఇంటికి చేరుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. కాని జరిగిన విషయం తెలిసి తల్లిదండ్రులకు గుండె బద్దలయినంత పని అయింది. వెంటనే బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.