పరీక్ష పాస్ కావాలనుకున్నాడు.. కానీ ప్రాణం పోయింది?

praveen
ప్రస్తుతం టెక్నాలజీ మారిపోయింది. మనిషి జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇదే సమయంలో అటు చదువుకునే విధానంలో కూడా ఎంతగానో మార్పులు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు విద్యార్థులు అందరూ ఎంతో ఇష్టంతో చదివేవారు. కానీ నేటి రోజుల్లో ఎంతో కష్టంగా చదువుతున్నారు. ర్యాంకుల ఊబిలో కూరుకుపోతున్న విద్యా వ్యవస్థలో ఇక విద్యార్థులు అందరిని బట్టీపట్టి చదివిస్తూ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు అన్నది అందరికీ తెలిసిన నిజం. ఇలా నేటి రోజుల్లో అర్థం చేసుకుని చదువుతున్న వాడికంటే ర్యాంకుల కోసం బట్టీపట్టి చదువుతున్న వారు ఎక్కువై పోతున్నారు  అదే సమయం లో ఎంతోమంది విద్యార్థులు బట్టీపట్టి చదవలేక పరీక్షల్లో ఫెయిల్ అవుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.



 అంతే కాదు ఇలా పరీక్షల్లో ఫెయిల్ అయ్యాము అన్న కారణంతో మనస్తాపం చెంది ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కూడా సంచలనం గానే మారిపోతుంది అని చెప్పాలి. అయితే సాధారణంగా పరీక్షల సమయంలో విద్యార్థులు ఎవరి పరీక్షలు వారే రాయాల్సి ఉంటుంది. కానీ సినిమాల్లో మాత్రం ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాయడం లాంటివి చూస్తూ ఉంటాం. ఇక ఇలా సినిమాల్లో సాధ్యం అవుతుంది కానీ నిజజీవితంలో సాధ్యం అవ్వదు అని చెప్పాలి. ఎందుకంటే పరీక్షా కేంద్రం లో ఉండే ఇన్విజిలేటర్లు హాల్ టికెట్ ను పరిశీలించిన తర్వాత పరీక్ష రాయడానికి అనుమతిస్తూ ఉంటారు.


 ఇకపోతే ఇక్కడ ఒక బీటెక్ విద్యార్థి ఇలాంటిదే చేసి ఎవరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మోదుగుల పేట లో వెలుగులోకి వచ్చింది. సాయి ప్రదీప్ అనే విద్యార్థి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఒక బ్యాక్ లాక్ ఉండగా డిసెంబర్ 8వ దీనికి జరిగిన పరీక్ష జరిగింది. అయితే ఎలాగైనా పాస్ కావాలని తప్పుడు ఆలోచన చేశాడు. తప్పుడు హాల్టికెట్ ఇచ్చి స్నేహితుడితో పరీక్ష రాయించాడు. ఈ క్రమంలోనే అటు ఇన్విజిలేటర్లు ఇది గమనించి అతన్ని పట్టుకున్నారు. ఒక విచారణ కమిటీని కూడా వేశారు. విచారణకు తల్లిదండ్రులు హాజరుకావాలని నోటీసు కూడా పంపారు. దీనిని ఎంతో అవమానంగా భావించిన సాయి ప్రదీప్ రైలు కింద  పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: