హ్యాట్సాఫ్ ఆటోడ్రైవర్ : ఆ 14 ఏండ్ల బాలికను ఎలా సేవ్ చేశాడంటే..!

MOHAN BABU
ఇంటి నుంచి పారిపోయిన 14 ఏళ్ల బాలిక ఆటో డ్రైవర్ ద్వారా కుటుంబంతో తిరిగి కలిసింది. మరి ఆ బాలిక ఏం చేసిందో తెలుసుకుందామా..?ఆటో-రిక్షా డ్రైవర్ రాజు కర్వాడే ప్రయాణికుల కోసం  వసాయ్ స్టేషన్ వెలుపల వేచి ఉండగా, బాలిక సహాయం కోసం అతనిని సంప్రదించింది.
చదువుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో న్యూఢిల్లీలోని తన ఇంటి నుండి పారిపోయిన 14 ఏళ్ల బాలిక, మహారాష్ట్రలోని తన కుటుంబంతో తిరిగి కలిసింది.  ఎలా అంటే ఆటో రిక్షా డ్రైవర్ వెంటనే పోలీసులను అప్రమత్తం చేసినట్లు అధికారి తెలిపారు.


పూర్తి వివరాల్లోకి వెళితే  శనివారం ఉదయం ఆటో రిక్షా డ్రైవర్ రాజు కర్వాడే (35) ప్రయాణికుల కోసం ఇక్కడి వాసాయి స్టేషన్ వెలుపల వేచి ఉండగా, బాలిక అతని వద్దకు వచ్చి, ఈ ప్రాంతంలో ఉండటానికి గది లభిస్తుందా అని అడిగింది. బాలిక పై అనుమానం వచ్చినటువంటి ఆటోడ్రైవర్ ఆమె దగ్గర నుంచి బాలిక గుర్తింపు కార్డును పరిశీలించి ఆమె గురించి ఆరా తీశారు. తాను న్యూఢిల్లీకి నుండి ఒంటరిగా ఇక్కడికి వచ్చానని ఆ యువతి తెలియజేసింది.


త్రీవీలర్ డ్రైవర్ వెంటనే ట్రాఫిక్ పోలీసును అప్రమత్తం చేసి, బాలికను మానిక్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడని అధికారి తెలిపారు. తాను న్యూఢిల్లీలోని పుష్ప్ విహార్‌కి ప్రాంతానికి చెందిన దాన్ని అని చదువుపై దృష్టి పెట్టాలని తల్లి ఒత్తిడి చేయడంతో శుక్రవారం ఇంటి నుంచి పారిపోయానని బాలిక పోలీసులకు తెలిపిందని ఆయన తెలిపారు. ఇక్కడి పోలీసులు ఢిల్లీలోని సాకేత్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించారు. అక్కడ బాలిక తల్లిదండ్రులు కిడ్నాప్ ఆరోపణలపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు బాలిక తల్లిదండ్రులకు ఆచూకీ తెలియజేశారు. దింతో బాలిక తల్లిదండ్రులు విమానంలో వెంటనే వసాయ్ చేరుకున్నారు. అక్కడ వారు శనివారం సాయంత్రం తమ కుమార్తెతో తిరిగి కలిశారని మాణిక్ పూర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ బహు సాహెబ్  తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఆటో రిక్షా డ్రైవర్‌ను సన్మానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: