భలే దొంగ.. దోచేస్తాడు తుడిచేస్తాడు?

praveen
ఇటీవలి కాలంలో దొంగల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే. దీంతో తాళం వేసి ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే అందరూ భయపడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం వ్యాపారం చేసుకుని జీవించడం కంటే దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటు జల్సాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు నేటి రోజుల్లో జనాలు.  దీంతో ఇటీవల కాలంలో దొంగల బెడద పెరిగి పోతూనే ఉంది. పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినప్పటికీ పోలీసులకు సవాల్ విసిరే విధంగా చోరీలకు పాల్పడుతున్నారూ ఎంతో మంది దొంగలు.

 ఇటీవలి కాలంలో ఇలా చోరీలకు పాల్పడేందుకు సిద్ధమైన దొంగలు వినూత్నమైన మార్గాలను కూడా ఎంచుకుంటూ ఉండటం గమనార్హం. సాధారణంగా ఒక ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగలు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అన్నిరకాల పాత్రలను ముట్టుకోవడం చేస్తూ ఉంటారు. ఇక ఆ పాత్రలపై దొంగలకు సంబంధించిన వేలిముద్రలు అలాగే ఉండిపోతాయి. ఆ తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి వేలిముద్రల ఆధారంగా దొంగలను పట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం అలా పోలీసులకు అలా దొరకను అనుకున్నాడో ఏమో.. కాస్త కొత్తగా ఆలోచించాడు ఇక్కడ ఒక దొంగ.

 అందరిలాగానే ఇళ్లల్లోకి చొరబడి దొంగతనం చేస్తాడు ఇక వేలిముద్రలు ఎక్కడా కనిపించకుండా మళ్ళీ తుడిచేస్తాడు. వైజాగ్ కి చెందిన మారాడా సాయి ఇలా వెరైటీ దొంగతనాలు చేస్తూ పోలీసులకు షాక్ ఇస్తున్నాడు. గతంలో జైలుకెళ్లిన అతని తీరు లో మాత్రం మార్పు రాలేదు. ఇక దొంగతనాలకు పాల్పడటం ఎక్కడా ఆధారాలు దొరకకుండా నీటుగా ఇల్లు తుడిచేయటం లాంటివి చేస్తున్నారు. పోలీసులకు ఇతనిని పట్టుకోవటం పెద్ద సవాలుగా మారిందని తెలుస్తోంది. ఇటీవలే ఒక దొంగతనం కేసులో పాత నేరస్తుల జాబితాను తీసి సాయిని పట్టుకుని విచారించగా అసలు విషయం బయట పెట్టాడు ఈ దొంగ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: