హమ్మో: ఆ యువతీ వాట్సాప్ మెసేజ్ ఖరీదు రూ.4.73 లక్షలు..!!
ఇక ప్రస్తుతం టెక్నాలజీ వాడకం పెరిగిపోయిన తర్వాత సైబర్ కేటుగాళ్లు రాటుదేళ్ళారు. ఇక వారు ఇంట్లోనే కూర్చొని మన ఫోన్లను ఆపరేట్ చేస్తూ మనకు తెలియకుండానే డబ్బులు దోచుకుంటున్నారు. అలా మోసపోయేవారిలో కొందరి అమాయకత్వం, తెలియనితనం అయితే మరికొందరిది అత్యాశ అనే చెప్పాలి మరి. ఇక భారీ కమీషన్ వస్తుందన్న అత్యాశతో ఓ యువతీ ఉన్నందా పోగొట్టుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 12వ వార్డుకు చెందిన ఓ యువతి చదువుకుంది. ఆమె ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. అంతలోనే ఆమెకి వాట్లాప్ ద్వారా ఓ మేసేజ్ రావడంతో ఆమె ఆ లింక్ లో చెప్పిన విధంగా ముందుగా వారికి రూ.100 ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేసింది యువతీ. ఆమె కొన్ని వస్తువులు కొనడంతో మీకు కమిషన్ వస్తుందని అవతలి వ్యక్తి నమ్మబలికాడు.
ఇక ఆమె అలా మూడుసార్లు కమిషన్ వచ్చినట్లు కొంత నగదు పంపించారు. వారు మనీ ఎక్కువగా ఇవ్వడంతో అత్యాశకు పోయిన హిమబిందు మరింత డబ్బు చెల్లించింది. అయితే కమీషన్ లక్షల్లో వస్తుందని.. అందుకోసం ముందుగా 30శాతం నగదు డిపాజిట్ చేయాలని అవతలి వ్యక్తులు నమ్మబలికాడు. దాంతో ఆమె మొత్తం రూ.4.73లక్షలు వారి ఖాతాలో డిపాజిట్ చేయగా.. అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పాలకొల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతీ. పోలీసులు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.