ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఇలా చేస్తాడని ఎవరూ అనుకోరు?
అతని మాటలు నమ్మిన యువతి పెళ్లి కూడా చేసుకుంది. ఇక జీవితం మొత్తం ఎంతో సంతోషంగా ఉంటుంది అని భావించింది. కానీ ఇంతలోనే లేకుండా నువ్ బ్రతకలేను అని చెప్పినవాడు ఇక ఆ అమ్మాయికి ఉసురు పోసుకున్నాడు. పెళ్ళైన నాలుగు నెలలకే ప్రాణం తీశాడు. ఈ ఘటన పోతవరం మండలంలో వెలుగులోకి వచ్చింది. పోతవరం గ్రామానికి చెందిన నాగరాజుకు పార్వతి దంపతులకు పావని అనే కుమార్తె ఉంది. పావని కి సాయి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారింది.
మొదట వీరి ప్రేమకు పెద్దలు నో చెప్పగా ఆ తర్వాత మాత్రం అర్థం చేసుకుని ఒప్పుకున్నారు. ఇటీవలే పెద్దల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. మూడు నెలల పాటు ఎంతో సక్రమంగానే సాగింది వీరి దాంపత్య బంధం. ఇటీవలే పుట్టింటికి వచ్చిన పావని ఇంటి దగ్గరే ఆన్లైన్ తరగతులు చదువుతుంది. అప్పటికే మద్యానికి అలవాటు పడి పావనిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు సాయి. భార్యను ఇంటికి తీసుకురావాలని ప్రయత్నించగా రాను అంటూ చెప్పేసింది భార్య.. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సాయి వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఘటనలో పావని అక్కడికక్కడే మృతి చెందగా అత్తకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.