మద్యం తాగితే మనిషికి కోతికి పెద్ద తేడా ఉండదని చాలా అంటున్నారు. అందులో వుండే ఆల్కహాల్ మత్తును కలిగిస్తుంది. అందుకే చాలా మంది తాగిన తర్వాత ఎం చేశారు అన్నాడు గుర్తుకు రాదు. ఆ సమయం లో కోపం కూడా ఎక్కువగానే వుంటుంది. వాళ్ళు అడిగినది ఆ సమయం లో లేనప్పుడు కోపం తో ఎంత దారుణలకు అయిన పాల్పడుతారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తు లో కూర లేదని తల్లి అనడం తో అతి కిరాతకంగా కన్న తల్లిని పొట్టన పెట్టుకున్నారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.. మద్యం మత్తు తో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి.. చిన్న చిన్న విషయాలకు కన్న తల్లిని దారుణంగా గొడ్డలి తో సరికి చంపిన ఘటన ఇప్పుడు ఆలొచించేలా చెస్తుంది.విశాఖ జిల్లా వంతాలలో చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల సమీపంలోని వంతాల పంచాయతీ కి చెందిన రేగం రామన్న దొర, అర్జులమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.గత రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తల్లిని లేపి అన్నం పెట్టమని కొరాడు.
తల్లి కూర ఏమి లేదని చెప్పడం తో ఆగ్రహం వ్యక్తం చేశాడు.. తర్వాత ఆమెను బలంగా కొట్టాడు. వద్దని వారించిన తండ్రితోనూ వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ ఏ పరిస్థితులకు దారి తీస్తుందోన్న భయంతో రామన్న దొర తన పెద్ద కుమారుడిని తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. రామన్న దొర బయటకు వెళ్లిన సమయాన్ని అదనుగా తీసుకున్న మత్స్యలింగం తల్లిని పక్కనే ఉన్న గొడ్డలి తో నరికాడు. తీవ్ర రక్తస్రావం కావడం తో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఇంటికి వచ్చిన తండ్రి కన్నీరు మున్నీరు అయ్యాడు. కొడుకుకు కథిన శిక్షలను విధించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు..పూర్తీ వివరాలు తెలియల్సి ఉన్నాయి.