కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అంతగా ఫెమస్ అయ్యింది.. మొదటి సినిమా భారీ సక్సెస్ ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస సినిమల లో నటించ ఛాన్స్ ను అందుకుంది.అలా ఎన్నో హిట్ సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించింది..ఆ ఘనత ఆమెకే దక్కుతుంది. 15 ఏళ్ల పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఇటీవల పెళ్ళి చేసుకొని భర్త తో సంసారం చేసుకుంటూ హ్యాపిగా వుంది.
పెళ్ళి తర్వాత కొన్ని సినిమాలు చెస్తానని సైన్ చేసింది. అయితే ఆ సినిమాలు చేస్తున్నప్పుడు ఆమెకు ప్రెగ్నెన్సీ రావడంతో ప్రస్తుతానికి సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. తల్లి కాబోతున్న కాజల్ తన ప్రెగ్నెన్సీ టైంని ఆస్వాదిస్తోంది. తాను పెళ్ళయిన వెంటనే ఇలా తల్లి అవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆమె చాలా సార్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది..కాజల్ ప్రెగ్నెంట్ అవ్వడంతో సహజంగానే తన శరీరంలో, తన ముఖం పై కొన్ని మార్పులు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు కాజల్ అందం పోతుందని, దాన్ని కూడా కాపాడుకొవాలని కొందరు హితవు పలికారు.
ఈ విషయం పై తాజాగా కాజల్ అగర్వాల్ స్పందించింది. అందరితో బాగుంటే మంచిది. ఒకరి గురించి నోటికి వచ్చినట్లు అనడం మానాలి. అప్పుడే మీరు మంచిగా ఉంటారు అని చెప్పింది. గర్భధారణ సమయంలో మన శరీరాలు బరువు పెరగడంతో పాటు అనేక మార్పులకు గురవుతాయి. హార్మోన్ల మార్పులు కలుగుతాయి.. కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ చాలా మార్పులు వస్తాయి కడుపు భాగంతో పాటుగా ఇతర బాగాలు పెరుగుతాయి. డెలివరీ అయ్యాక శరీరం మళ్ళీ పూర్వస్తాయికి రావడం చాలా కష్టం అవుతుంది. తల్లి ఒక బిడ్డకు ప్రాణం పొసెందుకు తన శరీరాన్ని వదిలెస్తుంది. దయచేసి తల్లిని కామెంట్ చేయకండి. అంటూ అందరికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది.