పెరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యొక్క ఘటనలో దాదాపు 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రమాదం ఎలా జరిగింది.. ఎప్పుడు జరిగింది అనేది మనం తెలుసుకుందాం..? ఉత్తర పెరులోని లిబర్టీ రీజియన్ లో ఒక బస్సు లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో దాదాపు 20 మంది ప్రయాణికులు మృతి చెందగా. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తర పేరులోని లైబర్టెడ్ రీజియన్లో ప్రయాణికులతో వెళుతున్నటువంటి ఒక బస్సు రోడ్డుపై నుంచి లోయలో పడింది. ఈ సందర్భంగా బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు మృతిచెందగా, మరో 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనలో గాయపడ్డ 30 మందిలో చాలా మంది సీరియస్ గా ఉన్నట్లు పేరు అధికారులు తెలియజేశారు. ఈ యొక్క బస్సు తయాబంబ నుంచి ట్రుజిల్లో కు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని సమాచారం. ఈ బస్సు ప్రయాణిస్తున్నప్పుడు సుమారుగా 100 మీటర్ల లోతున లోయలోకి దూసుకు పోయిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది అని, ఈ యొక్క ఘటనలో నాలుగు సంవత్సరాల చిన్నారితో పాటుగా 20 మంది మరణించారని అధికారులు తెలియజేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలావరకు జరిగాయని, దీనికి ప్రధాన కారణం అద్వానంగా ఉన్నటువంటి రోడ్లు, మితిమీరిన వేగం, ప్రమాద సూచికలు లేకపోవడం, రోడ్డు అధికారులు సరైన నిబంధనలను అమలు చేయలేకపోవడం వల్ల తరచుగా ఈ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత సంవత్సరం నవంబర్ 10వ తేదీన ఉత్తర పేరు జంగిల్ లో ఇలాంటి ఒక ప్రమాదం జరిగింది. ఒక మినీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురి అవడంతో చాలామంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా బస్సు ప్రమాదానికి అక్కడ ఉన్నటువంటి రోడ్లు బాగా లేకపోవడం వల్లే జరిగిందని తెలిపారు. 340 కిలోమీటర్లు ఉన్నటువంటి బస్సు ప్రయాణానికి రోడ్లు అధ్వానం కారణంగా 14 గంటల సమయం పడుతోందని, ఈ సందర్భంలోనే ప్రమాదానికి గురైందని బాధితులు తెలియజేశారు.