ప్రేమలో గెలిచింది.. జీవితంలో ఓడిపోయినా యువతీ..!!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన దోర్ల ప్రవళిక కు బోర్గం(పి) గ్రామాని కి చెందిన చామాకూర మహేష్ తో ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. అయితే వారిద్దరూ ప్రేమించుకున్నారు .. విషయం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకారం తెలుపడంతో 2017 ఏప్రిల్ 30 న ఘనంగా పెళ్లి చేశారు. కూతురికి కట్నంగా 20లక్షల రూపాయలు.. బంగారు ఆభరణాలు.. లాంఛనాలు కూడా అందజేశాడు.
అయితే పెళ్ళైన మొదట్లో వాళ్ళ కాపురం సాఫిగా సాగింది. కొంతకాలం తరువాత అత్త, భర్త, మేనమామలు అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడ్డారని మృతురాలి తల్లి కన్నీరు పెట్టుకుంది. ఇక కూతురు కొసం తండ్రి అదనపు కట్నం కింద లక్షల్లో డబ్బులు పంపించారు.. అయినా వేధించడం మానుకొలేక పోయారని వాపోయారు.
అంతేకాదు.. అనేకసార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగిందని. కుల పెద్దలు నచ్చ జెప్పి కాపురానికి పంపిస్తూ ఉండేవారు. కాగా.. చివరికి పుట్టింటికి చేరుకున్న ప్రవళిక మనస్తాపం చెంది సుసైడ్ నోటు రాసి ఇంట్లో కిటికి కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టు నిమితం స్థానిక ఆసుపత్రికి తరలించారు.