2లక్షల కిలోల గంజాయి దాహనం..దాని విలువ 200 కోట్లు..ఎక్కడంటే..!

MOHAN BABU
 గంజాయ్..దీన్ని ఒకసారి గట్టిగా గుంజారంటే మీరు గతాన్ని మర్చి పోయేలా, మీది మీరే గాల్లో తేలిపోయేలా, మనకి మనమే మరిచిపోయేలా  మానవ జీవితం మంట కలిసేలా, మీ కుటుంబాన్ని రోడ్డున పడేలా, లేదా నువ్వే ఇంకో కుటుంబాన్ని రోడ్డున పడే సెల  చేస్తుంది ఆ గంజాయ్. ఈ గంజాయి తాగుతూ ఎంతోమంది యువకులు ఎంజాయ్ చేస్తున్నామని  చెప్పుకుంటూ సమాజంలో అనేక  ఈ సమస్యకు కారణం అవుతున్నారు. అంతటి గంజాయి సమస్యపై ఏపీ పోలీసులు గన్ను పెట్టారు. ఏకంగా గంజాయిని బయటకు గుంజారు.  దేశ చరిత్రలోనే ఏనాడు లేని విధంగా తొలిసారి   కొన్ని లక్షల  కిలోల గంజాయిని పట్టుకొని పోలీసులు ఔరా అనిపించారు. మరి దాని విలువ కూడా కోట్ల రూపాయల లోనే ఉంటుంది. మరి ఈ సంఘటన ఎక్కడ జరిగింది తెలుసుకుందామా..?


విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి సమీపాన కోడూరు గ్రామంలో  ఈరోజు మధ్యాహ్న  సమయంలో  దాదాపు 250 కోట్ల విలువైన రెండు లక్షల కిలోలకు పైగా గంజాయిని దహనం చేయనున్నారు. ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీన్ని  ఈరోజు దహనం చేయనున్నారు.  విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం  తూర్పుగోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి మొత్తం గంజాయిని లెక్క చేస్తే రెండు లక్షల కిలోలు  వచ్చింది. దీన్ని ఆపరేషన్ పరివర్తన్ అనే కార్యక్రమంలో భాగంగా  రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ యొక్క ఆపరేషను రాష్ట్రంలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో, అలాగే సరిహద్దు రాష్ట్రాలు సహాయ సహకారాలతో  పోలీస్ శాఖ గంజాయి తోటలపై ఉక్కుపాదం మోపింది. కొన్ని దశాబ్దాల కాలంగా  ఏ ఓ బి తో పాటుగా గిరిజన గ్రామాల్లో  ఈ యొక్క గంజాయ్ సాగు నడుస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు ఏపీ సీనియర్ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో ఈ యొక్క భారీ గంజాయిని కాల్చి చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమం కోసం స్పీకర్లు డ్రోన్ కెమెరాలు సౌండ్ సిస్టం ఫ్యాన్సీ టెంటు అందుబాటులో ఉంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: