ఓరి నాయనో.. సిగరెట్ తాగుతూ చనిపోయాడు?
ఇక మరికొంతమంది సిగరెట్ తాగితే తమ బాడీ లోకి ఏదో తెలియని పవర్ వచ్చింది అని ఫీల్ అవుతూ ఉంటారు. ఏదేమైనా సిగరెట్ తాగితే ఆయుష్షు తగ్గిపోతుందని మాత్రం ఎవరూ పట్టించుకోరు అనే చెప్పాలి. సిగరెట్ తాగే అలవాటు ఇక్కడ ఒక వ్యక్తి ప్రాణం తీసింది. తరచూ సిగరెట్ తాగే అలవాటు అతనికి ఉంది.. ఇక రాను రాను సిగరెట్ కి బానిస గా మారిపోయాడు. ఆ తర్వాత అనారోగ్యంతో మంచానపడ్డాడు. కానీ సిగరెట్ అలవాటు మాత్రం వదులుకో లేక పోయాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు సదరు వ్యక్తి.
ఇక హైదరాబాద్ లోని గోషామహల్ లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. సిగరెట్ కాలుస్తూ ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ఒక వ్యక్తికి కాలిన గాయాల అయ్యాయి. ఈ క్రమంలోనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తనువు చాలించాడు. మధుకర్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఇంట్లోనే ఉండగా సిగరెట్ కి బానిసగా మారిన సదరు వ్యక్తి ఇటీవలే సిగరెట్ తాగడానికి లైటర్ వెలిగించాడు. నిప్పురవ్వలు మంచం పై పడటంతో మంటలు అంటుకున్నాయి. ఇది చుసిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు..