కాళ్ల పారాణి ఆరకముందే.. ఇలా జరిగిందేంటి?
ఊహకందని రీతిలో చావు దరి చేరుతుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. అతిథులు బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. దీంతో ఇక ఆ యువతి ఆశలకు అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. కానీ అంతలోనే మృత్యువు దరి చేరుతుంది అన్న విషయాన్ని మాత్రం ఊహించలేకపోయింది సదరు పెళ్లి కూతురు. పెళ్లి జరిగిన తర్వాత రోజు రిసెప్షన్ జరగ్గా.. రిసెప్షన్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బ్రెయిన్డెడ్ అయ్యి చనిపోయింది.
ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రీనివాసపురం తాలూకాకు చెందిన చైత్ర లెక్చరర్గా ఉద్యోగం చేస్తుంది. ఇటీవల ఆమెకు హోసకోట కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. ఇక ఇటీవలే పెళ్లి తర్వాత రిసెప్షన్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇక తల్లిదండ్రులు ఆమెను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. ఆరూ రోజుల నుంచి చికిత్స పొందిన చైత్ర చివరికి బ్రెయిన్డెడ్ కావడంతో ప్రాణాలు వదిలింది. అయితే ఆమె ప్రాణాలు వదిలినప్పటికీ అవయ దానం చేసి ఎంతో మంది ప్రాణాలు పోయాలి అని అనుకుంది. ఇలా అత్తారింటికి అడుగుపెట్టడానికి బదులు చివరికి కూతురు కాటికి చేరుకోవడంతో ఆ తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు.