పిన్నితో ఎఫైర్.. బాబాయ్ కి తెలిసింది.. చివరికి?
ఇలా వెలుగులోకి వస్తున్న అక్రమ సంబంధాలు ఎన్నో దారుణాలకు దారితీస్తుంది అని చెప్పాలి. అక్రమ సంబంధాల కారణంగా ఎంతోమంది హత్యలకు గురి అవుతుంటే ఇంకెంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగింది. అక్రమ సంబంధం నేపథ్యంలో ఓ బాలుడి పై పైశాచికంగా దాడి చేశారు ఇద్దరు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలుడి పై రెండు రోజుల కిందట అతని చిన్నాన్న లు అప్పన్న, సతీష్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
తొడలు మర్మాంగం పై వాతలు పెట్టారు. ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. అయితే ఇదంతా జరగడానికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. బాలుడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో అతను పెదనాన్న ఇంటివద్ద ఉండేవాడు. ఇటీవలే స్వగ్రామం వచ్చాడు. ఇక వరుసకు పిన్ని అయిన మహిళలకు బాలుడికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇక ఈ విషయం భర్త అప్పన్న కు తెలిసింది. దీంతో సతీష్ తో కలిసి అప్పన్న ఆ బాలుడి పై దారుణంగా దాడి చేశాడు.. ఇక పెద్దనాన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు.