దంపతులకు షాక్ ఇచ్చిన బంధువులు.. కారణం ఏంటంటే?

Satvika
సైన్స్ ఎంతగా పరిగెడుతున్నా మూఢనమ్మకాలు కూడా అంతకు మించి పెరుగుతూన్నాయని ఈ మధ్య జరిగిన ఘటనలు చూస్తె తెలుస్తుంది. వీటి వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నా కూడా జనాల ప్రవర్తన పూర్తిగా మారిపొయింది. అయితే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో ఇవి రాజ్యమెలుతున్నాయి. మొన్నీమధ్య ఉత్తర ప్రదేశ్ లో పాము కరిస్తే ఆవు పేడతో వైద్యం అని చెప్పి మహిళ ప్రాణాలును పొయ్యెలా చేశారు. ఇప్పుడు అటువంటి ఘటన తాజాగా వెలుగు చూసింది. బంధువుల మీద చేతబడి చేస్తున్న దంపతులిద్దరిని పట్టుకొని చిథకబాదారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.


వివరాల్లొకి వెళితే.. ఈ తెలంగాణాలో వెలుగు చూసింది. మెదక్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నారంటూ దంపతులను బంధువులు దారుణంగా కొట్టారు..వాళ్ళు ఎప్పుడూ ఏదొక పూజలు చేస్తూ వస్తున్నారు.. అయితే వారి వింత చేష్టలు ఎక్కువ అయ్యాయి. వీళ్ళు రోజు రోజుకు అందరికి ఇబ్బందులను గురి చెస్తున్నారు. దాంతో భయానికి గురైన స్థానికులు, వారి బంధువులు వారిని పట్టుకొని చిథకబాదారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇది నిజంగా భయంకరంగా మారింది..


మెదక్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నారంటూ దంపతులను బంధువులు దారుణంగా కొట్టి ఊరి నడి బొడ్డున కట్టేసారు. ఈ అనాగరిక సంఘటన అల్లాదుర్గం గ్రామంలో జరిగింది. చేతబడి చేస్తున్నాడని ఆరోపించిన వారి స్వంత బంధువులే ఒక వ్యక్తి, అతని భార్యను విద్యుత్ స్తంభానికి కట్టేసి నిర్దాక్షిణ్యంగా కొట్టారు. దుండగులు బోయిన రమేష్ , అతని భార్య రజిత ఇంటిపై దాడి చేసి, తమపై చేతబడి చేస్తున్నారని ఆరోపిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం దంపతులపై దాడి చేసి వీధిలో ఊరేగించారు... ఈ విషయం పై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.కేసు నమోదు చేసుకొని పూర్తీ వివరాలు సెకరించె పనిలో ఉన్నారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: